నిన్న ‘ఇస్మార్ట్ శంకర్’.. నేడు ‘గద్దలకొండ గణేష్’

నిన్న ‘ఇస్మార్ట్ శంకర్’.. నేడు ‘గద్దలకొండ గణేష్’

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) హరీష్ శంకర్‌ కెరీర్‌కు అత్యవసరమైన బ్రేక్ ఇచ్చేలాగే ఉంది. తొలి రోజు అంచనాల్ని మించిపోయి ఏకంగా రూ.7 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా బలంగానే నిలబడింది. వసూళ్లు కొంత మేర డ్రాప్ అయ్యాయి కానీ.. అయినా కూడా మంచి షేరే వచ్చింది రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.4.5 కోట్ల దాకా షేర్ రాబట్టింది.

తెలంగాణలో తొలి రోజుకు దీటుగా ఈ చిత్రం వసూళ్లు రాబట్టడం విశేషం. శుక్రవారం ఇక్కడ రూ.1.6 కోట్ల షేర్ రాగా.. రెండో రోజు షేర్ రూ.1.4 కోట్లు కావడం విశేషం. తెలంగాణ నేటివిటీతో తెరకెక్కే సినిమాలు ఇక్కడ బాగా ఆడుతుండటం గమనించవచ్చు. ఈ మధ్యే ‘ఇస్మార్ట్ శంకర్’ ఇక్కడ వసూళ్ల మోత మోగించింది. అందులో హీరో పాత్రతో ఇక్కడి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

ఇప్పుడు అదే తరహాలో గద్దలకొండ గణేష్ పాత్రతోనే తెలంగాణ ఆడియన్స్ కనెక్ట్ అయినట్లే ఉన్నారు. ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ తెలంగాణ వాడే కావడంతో వరుణ్ పాత్రను ఇక్కడి జనాలు మెచ్చేలా తీర్చిదిద్దాడు. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ తెలంగాణ యాస పలికిన అనుభవం లేకపోయినా.. వరుణ్ ఏ తడబాటు లేకుండా గణేష్ పాత్రలో ఇక్కడి యాసతో చక్కగా డైలాగులు పేల్చాడు. సినిమా అంతా కూడా ఇక్కడి నేటివిటీనే కనిపించడంతో తెలంగాణ ప్రేక్షకులకు సినిమా బాగా ఎక్కేసింది.

దీంతో వసూళ్ల మోత మోగుతోంది. ఆదివారం తొలి రోజుకు దీటుగా వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ రోజు అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ ట్రెండ్ కనిపిస్తోంది. ‘గద్దలకొండ గణేష్’ రెండు రోజుల వరల్డ్ వైడ్ షేర్ రూ.12 కోట్ల దాకా ఉంది. వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం రూ.17 కోట్ల షేర్ మార్కును దాటొచ్చు. ఆ తర్వాత ఇంకో రూ.8 కోట్ల షేర్ సాధిస్తే బయ్యర్లు లాభాల్లోకి వస్తారు.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English