ఎల్లువొచ్చి గోదార‌మ్మా.. షేక్ ఆడిస్తోంది

ఎల్లువొచ్చి గోదార‌మ్మా.. షేక్ ఆడిస్తోంది

పాత సినిమాల్లోని సూప‌ర్ హిట్ పాట‌ల్ని రీమిక్స్ చేసి పెట్ట‌డం కొత్తేమీ కాదు. వాటిల్లో కొన్ని పాట‌లు మంచి ఆద‌ర‌ణ తెచ్చుకున్నాయి. సినిమాల‌కు ప్ల‌స్ అయ్యాయి. ఐతే ఇప్ప‌టిదాకా వ‌చ్చిన రీమిక్స్ పాట‌ల‌న్నీ ఒకెత్తు. వాల్మీకి/గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాలోని ఎల్లువొచ్చి గోదార‌మ్మ పాట మ‌రో ఎత్తు. ఈ సినిమాకు సంబంధించి ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌కు వ‌చ్చిన బెస్ట్ ఐడియా ఈ పాటే అని చెప్పొచ్చు.

ఈ చిత్రంలో ఈ పాట ఉంద‌న్న‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి క‌నిపిస్తోంది. దీని మేకింగ్ వీడియో విడుద‌ల‌కు ముందే జ‌నాల‌కు మంచి హై ఇచ్చింది. ఇక రిలీజ్ రోజు థియేట‌ర్ల‌లో అయితే ఎల్లువొచ్చి గోదార‌మ్మ పాట‌కు రెస్పాన్స్ మామూలుగా లేదు. సింగిల్ స్క్రీన్ల టాప్ లేచిపోయే స్థాయిలో జ‌నాలు హోరెత్తించేస్తున్నారు.

సినిమాలో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ఫ్లాష్ బ్యాక్ మొద‌ల‌వ‌డం, పూజా హెగ్డే క‌నిపించ‌డం ఆల‌స్యం.. ప్రేక్ష‌కుల్లో ఒక ఉత్సాహం వ‌చ్చేస్తుంది. ఇక ఎప్పుడెప్పుడు ఎల్లువొచ్చి గోదార‌మ్మ పాట వ‌స్తుందా అని ఉత్కంఠ‌గా ఎదురు చూడ‌టం మొద‌ల‌వుతుంది. ఊరించి ఊరించి.. ఒక పావుగంట‌కు పాట‌కు త‌గ్గ సంద‌ర్భం వ‌స్తుంది. ఇలా మ్యూజిక్ మొద‌ల‌వ‌డం ఆల‌స్యం.. జ‌నాలు సీట్ల నుంచి లేచిపోయి కేరింత‌లు మొద‌లుపెట్టేస్తున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌హేష్ బాబు.. రామ్ చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్ లాంటి బ‌డా స్టార్ల ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ల‌కు ఉన్న రేంజిలో ప్రేక్ష‌కులు థియేటర్ల‌ను హోరెత్తించేస్తున్న వీడియోలు ఇప్పుడు ట్విట్ట‌ర్‌ను ముంచెత్తుతున్నాయి. అలాంటి ఒక వీడియో షేర్ చేస్తూ.. ఇలాంటి స్పంద‌న కోస‌మే తాము మ‌రింత క‌ష్ట‌ప‌డాల‌ని అనుకుంటామంటూ పూజా ఎగ్జైట్మెంట్‌తో ట్వీట్ చేసింది. ఏమాట‌కామాటే చెప్పాలి. ఈ పాట‌లో పూజా హెగ్డే మామూలుగా హైలైట్ అవ్వ‌లేదు. పాట చిత్రీక‌ర‌ణ కూడా అదిరిపోయిందంతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English