సాహో బాట‌లోనే గ్యాంగ్ లీడ‌ర్‌

సాహో బాట‌లోనే గ్యాంగ్ లీడ‌ర్‌

ఈ మ‌ధ్య మంచి అంచ‌నాలున్న తెలుగు సినిమాల‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆరంభ శూర‌త్వం చూపించి.. ఆ త‌ర్వాత చ‌ల్ల‌బ‌డిపోతున్నాయి. మూడు వారాల కింద‌ట సాహో సినిమా ప‌రిస్థితి ఏమైందో తెలిసిందే. బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయి అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ప్ర‌భాస్ కొత్త సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జ‌రిగాయి.

సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌డం క‌లిసొచ్చింది. దీంతో వీకెండ్లో మూడు రోజులు, వినాయ‌క చ‌వితి సెల‌వు క‌లిపి మొత్తం నాలుగు రోజుల పాటు సాహో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. కానీ నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఐదో రోజు నుంచి ద‌బేల్‌మ‌ని కింద ప‌డింది. త‌ర్వాత కోలుకోలేక‌పోయింది. క‌నీస స్థాయిలో కూడా షేర్ రాక.. బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో నిలిచిపోయింది. పెట్టుబ‌డిలో రిక‌వ‌రీ 70 శాతం దాట‌లేదు. భారీగా ఇన్వెస్ట్ చేయ‌డం వ‌ల్ల బ‌య్య‌ర్లు నష్టాల ఊబిలో కూరుకుపోయారు.

గ‌త వారం వ‌చ్చిన నాని సినిమా గ్యాంగ్ లీడ‌ర్ ప‌రిస్థితి కూడా దాదాపుగా ఇలాగే త‌యారైంది. ఈ సినిమా తొలి వారాంతంలో బాగానే జోరు చూపించింది. డివైడ్ టాక్‌ను త‌ట్టుకుని మూడు రోజుల్లో రూ.16 కోట్లకు పైగా షేర్ కొల్ల‌గొట్టింది. ఇంకో 12 కోట్ల షేర్ వ‌స్తే బయ్య‌ర్లు సేఫ్ అయ్యే ప‌రిస్థితుల్లో వీక్ డేస్‌లో ఓ మోస్త‌రుగా న‌డిచినా చాల‌నుకున్నారు. కానీ సోమ‌వారం నుంచి వ‌సూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. నాలుగు రోజుల్లో రూ.3 కోట్ల షేర్ మాత్ర‌మే రావ‌డంతో తొలి వారం అయ్యేస‌రికి రూ.19 కోట్ల షేర్ మార్కును మాత్ర‌మే దాటిందా చిత్రం.

ఈ వారం కొత్త సినిమా వాల్మీకి వ‌సూళ్ల మోత మోగిస్తుండ‌టంతో గ్యాంగ్ లీడ‌ర్‌కు పెద్ద‌గా స్కోప్ లేన‌ట్లే ఉంది. ఫుల్ ర‌న్లో ఈ సినిమా రూ.21 కోట్ల మార్కును ట‌చ్ చేస్తే గొప్ప. కాబ‌ట్టి బయ్య‌ర్ల‌కు ఓ మోస్త‌రుగా బ్యాండ్ త‌ప్ప‌న‌ట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English