లేడీ క‌మెడియ‌న్ క‌న్నీటి గాథ‌

లేడీ క‌మెడియ‌న్ క‌న్నీటి గాథ‌

తెర‌మీద న‌వ్వులు పంచేవాళ్ల జీవితాల‌న్నీ స‌ర‌దాగా సాగిపోతాయ‌ని అనుకుంటే పొర‌బాటే. మ‌న‌కు తెలియ‌ని విషాద కోణాలు వీళ్ల జీవితాల్లో ఉంటాయి. కిత‌కిత‌లు క‌థానాయిక‌గా న‌టించి.. త‌న అవ‌తారం మీద అల్ల‌రి న‌రేష్‌తో బోలెడ‌న్ని పంచులేయించుకుని న‌వ్వులు పంచిన గీతా సింగ్ గుర్తుందా?

దీంతో పాటు అనేక సినిమాల్లో కామెడీ రోల్స్ చేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు వెండితెర‌పై పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. తాజాగా ఆమె ఒక టీవీ కార్య‌క్ర‌మానికి కుటుంబంతో క‌లిసి హాజ‌రైంది. సుమ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించే ఈ గేమ్ షోలో హుషారుగా పాల్గొంది. చాలా వ‌ర‌కు న‌వ్వులు పంచుతూ సాగిన ఈ కార్య‌క్ర‌మంలో ఒక ద‌శ‌లో ప్రేక్ష‌కుల్ని తీవ్ర ఉద్వేగానికి గురి చేసింది. ఇందుకు కార‌ణం గీతా సింగ్ కుటుంబ నేప‌థ్యం వెల్ల‌డి కావ‌డ‌మే.

గీతా తండ్రి ఎప్పుడో చ‌నిపోయార‌ట‌. త‌ల్లే అన్నీ కుటుంబాన్ని న‌డిపించింద‌ట‌. కానీ ఆమె అనారోగ్యం పాలై చాలా ఏళ్ల కింద‌టే ప‌ని చేయ‌డం మానేసింది. మ‌రోవైపు గీతా అన్న‌య్య చ‌నిపోయాడ‌ట‌. ఆయ‌న పిల్ల‌లు అనాథ‌ల‌య్యారు. అలాంటి స్థితిలో గీతా సింగ్ కుటుంబ బాధ్య‌తను తీసుకుంద‌ట‌. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని త‌ను.. కుటుంబం కోసం ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అనేక క‌ష్టాలు ప‌డి అవ‌కాశాలు సంపాదించింద‌ట‌.

ఓ అమ్మాయి అనారోగ్యం పాలైన త‌ల్లిని చూసుకుంటూ.. ఇద్ద‌రు చిన్న పిల్ల‌ల్ని చ‌దివించుకుంటూ కుటుంబాన్ని న‌డ‌ప‌డం అంటే మాట‌లా? కిత‌కిత‌లు మిన‌హాయిస్తే గీతా పెద్ద రోల్స్ ఏమీ చేయ‌లేదు. కోట్లు కోట్లు సంపాదించేయ‌లేదు. చిన్న చిన్న పాత్ర‌ల‌తోనే కెరీర్‌ను కొన‌సాగించింది. ఈ క్ర‌మంలో ఆమె ఎంత ఇబ్బంది ప‌డిందో అంచ‌నా వేయొచ్చు. కుటుంబం కోసం గీతా పెళ్లి కూడా చేసుకోక‌పోవ‌డాన్ని బ‌ట్టి ఆమెది ఎంత గొప్ప మ‌న‌సో అంచ‌నా వేయొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English