ఉయ్యాల‌వాడ కుటుంబీకుల‌కు రూ.50 కోట్లు ఇవ్వాల‌ట‌

ఉయ్యాల‌వాడ కుటుంబీకుల‌కు రూ.50 కోట్లు ఇవ్వాల‌ట‌

ఇంకో ప‌ది రోజుల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ చిత్రం రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కింద‌న్న సంగ‌తి తెలిసిందే.

ఐతే ఉయ్యాల‌వాడ వంశానికి చెందిన ఐదో త‌రం కుటుంబీకులు న‌ర‌సింహారెడ్డిపై సినిమా తీసినందుకు త‌మ‌కు రాయ‌ల్టీ ఇవ్వాల‌ని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య హైద‌రాబాద్‌లో రామ్ చ‌ర‌ణ్ కార్యాయ‌లం వ‌ద్ద కూడా వాళ్లు ఆందోళ‌న నిర్వ‌హించారు. అప్ప‌టికి తాత్కాలికంగా గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. ఐతే సినిమా విడుద‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌గా.. ఉయ్యాల‌వాడ వంశ‌స్థులు ఆందోళ‌న‌ను ఉద్ధృతం చేసే ప‌నిలో ప‌డ్డారు. సైరా నిర్మాత చ‌ర‌ణ్ మీద హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.

ఉయ్యాల‌వాడ కుటుంబానికి చెందిన పాతిక మంది దాకా ఈ ఫిర్యాదు చేశారు. వీళ్లంద‌రూ త‌మ‌కు త‌లో రూ.2 కోట్లు రాయ‌ల్టీ చెల్లించాలంటున్నారు. అంటే వీళ్ల డిమాండ్ మేర‌కు చ‌ర‌ణ్‌ మొత్తంగా రూ.50 కోట్ల దాకా చెల్లించాల్సి  ఉంటుంద‌న్న‌మాట‌.

న‌ర‌సింహారెడ్డి జీవితం గురించి పూర్తి స‌మాచారం అందించింది తామే అని.. పైగా త‌మ గ్రామంలో చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిపార‌ని.. ఆ స‌మ‌యంలో త‌మ పంట‌లు కూడా దెబ్బ తిన్నాయ‌ని వాళ్లు అంటున్నారు. ఐతే గ‌తంలో ఆందోళ‌న జ‌రిగిన‌పుడు పంట‌ల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని, ఆర్థిక సాయం అందిస్తామ‌ని చ‌ర‌ణ్ ఆఫీస్ వాళ్లు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఇటీవ‌ల ట్రైల‌ర్ లాంచ్ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ఉయ్యాల‌వాడ గ్రామానికి సాయం చేస్తాం త‌ప్ప ఆయ‌న కుటుంబీకుల‌కు డ‌బ్బులివ్వ‌డం జ‌ర‌గ‌ద‌ని తేల్చి చెప్పాడు. మ‌రి తాజా కేసు నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English