ఏంటో ఈ తాగుబోతు గ్లోరిఫికేషన్‌

ఏంటో ఈ తాగుబోతు గ్లోరిఫికేషన్‌

తాగుడు దురలవాటు అని, మద్యపానం ఆరోగ్యానికి చేటు అని ప్రతి సినిమాకి ముందు రెండు నిమిషాల యాడ్‌ వేస్తుంటారు. తాగిన సీన్‌ వచ్చిన ప్రతిసారీ స్లయిడ్‌ కూడా వేస్తుంటారు. అయితే లిక్కర్‌తో నడిచే బండి పవర్‌ఫుల్‌ అనే మెసేజ్‌ ఇస్తూ '90 ఎంఎల్‌' అనే చిత్రంతో వస్తున్నాడు 'ఆర్‌ఎక్స్‌ 100' కార్తికేయ. టైటిల్‌లో నంబర్‌ వుండాలనే సెంటిమెంట్‌ని 'గుణ 369' తర్వాత కూడా మార్చుకోని కార్తికేయ ఈసారి తాగుబోతు పాత్రలో యూత్‌ని ఎట్రాక్ట్‌ చేయాలని చూస్తున్నాడు.

తాగుడు గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడితే కుర్రాళ్లు ఎగబడి చూసేస్తారనే అపనమ్మకం ఒకటి యువ దర్శకులలో వుంది. 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నుమా దాస్‌' అలాగే పల్టీ కొట్టాయి. కార్తికేయ ఏకంగా ఆథరైజ్డ్‌ డ్రింకర్‌ అంటూ 90 ఎంఎల్‌ అనే తాగుబోతు టైటిల్‌తో వస్తున్నాడు. డ్రింకింగ్‌ని ఎంకరేజ్‌ చేయని సెన్సార్‌ ఈ టైటిల్‌ని అప్రూవ్‌ చేస్తాయనేది డౌటే. అది అలా వుంచితే కార్తికేయకి మాత్రం సబ్జెక్ట్‌ సెలక్షన్‌ రావడం లేదు. మొదటి సినిమాతో వచ్చిన సక్సెస్‌ని నిలబెట్టుకోవడం ఎలాగో, మరోసారి యువతని తన సినిమాలకి రప్పించడం ఎలాగో అతనికి క్లూ లేదు. 90ఎంఎల్‌ టీజర్‌లో అయితే అసలు మేటర్‌ లేదు.

పంచ్‌ డైలాగులు అనుకున్నవి కూడా పేలలేదు. ఏమి చేసినా 'అన్నా నువ్వు సూపర్‌' అంటూ ట్వీట్లు పెట్టే పిల్లకాయలని చూసి క్రేజ్‌ అనుకుంటే మాత్రం కెరియర్‌కి 100 ఎంఎల్‌ సెలైన్‌ ఎక్కించక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English