గ్యాంగ్‌లీడర్‌ పరిస్థితి దారుణం!

గ్యాంగ్‌లీడర్‌ పరిస్థితి దారుణం!

తెరపై గ్యాంగ్‌లీడర్‌గా కనిపించింది నాని అయినా కానీ తెర వెనుక ఈ గ్యాంగ్‌ మొత్తాన్ని లీడర్‌లా నడిపించింది విక్రమ్‌ కుమార్‌. 'మనం'తో దర్శకుడిగా కీర్తి ప్రతిష్టలు గడించిన విక్రమ్‌ కుమార్‌ 24, హలో చిత్రాలలో కూడా తన ముద్ర చాటుకున్నాడు. ఆ చిత్రాలు ఆశించిన ఫలితం సాధించకపోయినా దర్శకుడిగా విక్రమ్‌ కుమార్‌ పేరు చెడగొట్టలేదు. అందుకే అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ లాంటి హీరోలు అతడితో పని చేయడానికి ఆసక్తి చూపించారు. గ్యాంగ్‌లీడర్‌ కథ అల్లు అర్జున్‌కి చెప్పినప్పుడు సెకండ్‌ హాఫ్‌ నచ్చలేదని, మార్చమని రిక్వెస్ట్‌ చేసాడు.

కానీ విక్రమ్‌ కుమార్‌ అదే కథని నానికి వినిపించి ఓకే చేసుకున్నాడు. తీరా సినిమా విడుదలయ్యాక సెకండ్‌ హాఫ్‌ బ్యాడ్‌ అనే టాక్‌కి తోడు, దర్శకుడిగా విక్రమ్‌ కుమార్‌ మార్క్‌ ఎక్కడా కనిపించలేదని కామెంట్‌ చేసారు. గ్యాంగ్‌లీడర్‌కి ఓపెనింగ్స్‌ వచ్చినా అది నాని పుణ్యమే. ఆ తర్వాత ఈ చిత్రం అసలు రంగు బయట పడిపోయింది. దీంతో ఇప్పుడు విక్రమ్‌ కుమార్‌తో పని చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. మనం లాంటి పాత్‌ బ్రేకింగ్‌ క్లాసిక్‌ తీసిన దర్శకుడు మళ్లీ అలా మ్యాజిక్‌ చేయలేకపోతున్నాడు.

గ్యాంగ్‌లీడర్‌తో కమర్షియల్‌ ట్రాక్‌ పట్టి తన ఫాన్స్‌ని కూడా నిరాశపరిచాడు. ఇలాంటి జీనియస్‌ డైరెక్టర్‌ ఇలా డీలా పడడం సినీ ప్రియులకి నచ్చడం లేదు. త్వరలోనే విక్రమ్‌ కుమార్‌ మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అయి క్రియేటివ్‌ ఐడియాలతో కదం తొక్కుతాడనే ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English