మహేష్‌ను వదిలే ప్రసక్తే లేదట

మహేష్‌ను వదిలే ప్రసక్తే లేదట

మామూలుగా స్టార్ హీరోలు ప్రతి దర్శకుడితోనూ స్నేహం చేయరు. వాళ్ల మనసుకు నచ్చే దర్శకులు, వ్యక్తిగతంగానూ స్నేహితులుగా మారేవాళ్లు కొద్దిమందే ఉంటారు. మహేష్ బాబు విషయానికి వస్తే.. ఇండస్ట్రీలో వ్యక్తిగతంగా స్నేహం ఉన్న దర్శకులు దాదాపుగా కనిపించరు. ఒక సినిమాకు పని చేసినంత కాలం వాళ్లతో చనువుగా ఉంటాడు. ఆ తర్వాత మూవ్ అయిపోతాడు. సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక దాదాపుగా ఏ దర్శకుడితోనూ అతను కనిపించింది లేదు.

కానీ ‘మహర్షి’ తర్వాత మాత్రం మహేష్‌లో మార్పు కనిపించింది. ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లితో చాలా క్లోజ్‌గా కనిపించాడు. మహేష్ యూరప్ టూర్ వెళ్తే అక్కడా అతనున్నాడు. ఇద్దరూ కలిసి లండన్లో ప్రపంచకప్ మ్యాచ్ కూడా చూశారు. ఆ తర్వాత జరిగిన రెండు పార్టీల్లోనూ మహేష్‌తో పాటు వంశీ ఉన్నాడు.

ఈ స్నేహం మహేష్ అభిమానులకే అంతుబట్టలేదు. మా వాడిని వదలవా అంటూ వంశీని సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు ప్రశ్నించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఐతే మహేష్‌తో వ్యక్తిగతంగా స్నేహం కుదరడంతో పాటు తన తర్వాతి సినిమాను కూడా ఆయనతోనే చేయాలనే ఉద్దేశం వల్ల కూడా వంశీ తనతోనే తిరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. అది నూటికి నూరు శాతం నిజం అంటున్నాయి మహేష్ సన్నిహిత వర్గాలు.

మహేష్, వంశీ కలయికలో మరో సినిమా రాబోతోందని.. వచ్చే ఏడాదే అది పట్టాలెక్కుతుందని.. ఇటీవలే మహేష్‌కు ఒక లైన్ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న వంశీ.. తన టీంతో కలిసి స్క్రిప్టు మీద పని చేయబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చేస్తున్న మహేష్.. దీని తర్వాత ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. నిజంగా ఆ ప్రాజెక్టు ఉంటుందో లేదో కానీ.. కాస్త ముందో వెనుకో వంశీతో మహేష్ మరో సినిమా చేయడం మాత్రం ఖాయమట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English