వరుణ్ వాడుకుంటాడా.. సూర్య పైకి లేస్తాడా?

వరుణ్ వాడుకుంటాడా.. సూర్య పైకి లేస్తాడా?

ఇంకో శుక్రవారం వచ్చేసింది. ఎన్నో ఆశలతో రెండు కొత్త చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. హరీష్ శంకర్-వరుణ్ తేజ్ కలయికలో తెరకెక్కిన ‘వాల్మీకి/గద్దలకొండ గణేష్’తో పాటు సూర్య నటించిన తమిళ డబ్బింగ్ మూవీ ‘బందోబస్త్’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలూ అందులో నటీనటులు, టెక్నీషియన్లకు కీలకమైన చిత్రాలే. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు చిత్రాలకు, ముఖ్యంగా ‘వాల్మీకి’కి అడ్వాంటేజ్ పొజిషన్ ఉంది.

పోయిన వారం వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ వీకెండ్ వరకు ఊపు చూపించి ఆ తర్వాత చల్లబడింది. వీక్ డేస్‌లో బాగా వీక్ అయిన నేపథ్యంలో పాజిటివ్ టాక్ తెచ్చుకునే కొత్త సినిమాకు అడ్వాంటేజ్ ఉంటుంది. ‘వాల్మీకి’కి వివిధ కారణాల వల్ల మంచి హైపే వచ్చింది. బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. చివరి నిమిషంలో పేరు మార్పు కూడా సినిమాకు పబ్లిసిటీ పరంగా మంచే చేసింది.

తమిళంలో సూపర్ హిట్టయిన ‘జిగర్ తండ’కు ‘వాల్మీకి’ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బేసిగ్గా ఈ కథ భలే ఉంటుంది. ఇక హరీష్ చేసిన మార్పులు చేర్పులు, వరుణ్ తేజ్ పాత్ర సినిమాకు మరింతగా మేలు చేస్తాయని ఆశిస్తున్నారు. ఈ సినిమాతో వరుణ్ మాస్ హీరోగా నిరూపించుకోవాల్సి ఉంది. హరీష్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సి ఉంది.

సూర్య విషయానికి వస్తే అతను తెలుగులో ఎప్పుడు హిట్ కొట్టాడో కూడా జనాలు మర్చిపోయారు. ఫ్లాపులతో అలసిపోయిన అతడికి అర్జెంటుగా ఓ హిట్ కావాలి. తనకు ‘వీడొక్కడే’ లాంటి పెద్ద హిట్ ఇచ్చిన కేవీ ఆనంద్ అయినా తన రాత మారుస్తాడేమో అని అతను ఎదురు చూస్తున్నాడు. ఇందులో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేయడం విశేషం. కేవీ ఆనంద్ స్టయిల్లో రేసీగా సాగే థ్రిల్లర్ మూవీలా కనిపిస్తున్న ‘బందోబస్త్’కు ఎలాంటి టాక్ వస్తుందో.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English