దేవరకొండపై కొండంత ఆశ పెట్టుకుంది

దేవరకొండపై కొండంత ఆశ పెట్టుకుంది

రాశి ఖన్నా హీరోయిన్‌గా పరిచయం అయి చాలా కాలం అవుతోంది. ఒక్కసారి ఎన్టీఆర్‌తో నటించింది కానీ లేదంటే ఆమె చేసే చిత్రాలన్నీ మిడిల్‌ రేంజ్‌ హీరోలతోనే. జై లవకుశ విజయం సాధించకపోవడంతో రాశి ఖన్నాకి పెద్ద హీరోల పక్కన నటించే ప్రమోషన్‌ దక్కలేదు. అయితే ప్రస్తుతం ఆమె మిడ్‌ రేంజ్‌ చిత్రాలతోనే చాలా బిజీగా వుంది. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌, వెంకీ మామ, ప్రతి రోజు పండగే చిత్రాల్లో నటిస్తోన్న రాశి మిగతా చిత్రాల మాట ఎలా వున్నా 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'పై చాలా ఆశలు పెట్టుకుంది.

విజయ్‌ దేవరకొండతో నటించిన తర్వాత రష్మిక టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. గీత గోవిందంతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన ఆమెపై పెద్ద నిర్మాతలు, హీరోల దృష్టి పడింది. అలాగే ఈ చిత్రం కూడా పెద్ద హిట్‌ అయితే తాను కూడా ఫేమస్‌ అయిపోయి మహేష్‌, అల్లు అర్జున్‌ లాంటి హీరోల నుంచి పిలుపు వస్తుందని రాశి ఆశిస్తోంది.

తన కెరియర్‌లోను కొన్ని విజయవంతమైన చిత్రాలున్నప్పటికీ ఇంతవరకు కెరియర్‌ మలుపు తిప్పే బ్లాక్‌బస్టర్‌ పడలేదు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ కనుక విజయ్‌ చిత్రాల మాదిరిగా సంచలనమయితే రాశి జాతకం మారిపోవచ్చు. ఇందులో ఇంకా పలువురు హీరోయిన్లు వున్నారు కానీ మెయిన్‌ ఫిమేల్‌ లీడ్‌ అయితే రాశినే కాబట్టి దీని మీదే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English