బిగ్‌బాస్‌ని టీవీ సీరియల్‌ చేసేసింది

బిగ్‌బాస్‌ని టీవీ సీరియల్‌ చేసేసింది

'పాతాళ గంగ' అంటూ యాంకర్‌ శివజ్యోతిని సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్‌ చేస్తుంటారు. చీటికీ మాటికీ కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా ఒక్కోసారి బోరుమంటూ ఏడ్చేస్తూ ప్రేక్షకులని టార్చర్‌ పెడుతుంటుంది. కేవలం కొద్ది వారాల పరిచయం వున్న వారి కోసం లబోదిబోమని ఏడవడం ఈమె స్పెషాలిటీ.

మధ్యలో కొద్ది రోజులు ఏడుపు ఆపినా ఈమధ్య డెయిలీ సీరియల్‌లా బిగ్‌బాస్‌ ప్రతి ఎపిసోడ్‌లోను ఏడ్చేస్తోంది. ఆమె ఏడుపుని ఎందుకు అంతగా ఫోకస్‌ చేస్తున్నారనేది ఎడిటర్లకే తెలియాలి. ఎక్కడ సానుభూతి ఓట్లు ఆమెకి పడిపోతాయోననే భయంతో మిగతా కంటెస్టెంట్లు కూడా బలవంతంగా ఏడ్చిన సందర్భాలు చాలానే వున్నాయి. మొదట్లో టఫ్‌గా వుంటానని చెప్పిన శ్రీముఖి, పునర్నవి కూడా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ట్యాప్‌ విప్పేస్తున్నారు.

బిగ్‌బాస్‌ నిర్వాహకులు కూడా ఈ డెయిలీ సీరియల్‌ చాదస్తం ఫ్యామిలీ ఆడియన్స్‌, లేడీస్‌ని ఆకర్షిస్తుందని భావిస్తూ వారం విడిచి వారం ఏదో ఒక ఎమోషనల్‌ టాస్క్‌ పెడుతున్నారు. అయిన వారిని చూసి ఎమోషనల్‌ అవడం కొంతవరకు ఓకే అనుకోవచ్చు కానీ ఎవరైనా కాస్త ఎమోషనల్‌ నటన చేసినా కానీ శివజ్యోతి గుడ్ల నిండా నీరు నింపుకుని గుక్క పెట్టేస్తుంది. ఈమెకి యాంకర్‌గా కంటే టీవీ సీరియల్‌ నటిగా మంచి ఫ్యూచర్‌ ఉంటుందనే జోక్స్‌ సోషల్‌ మీడియాలో పేలుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English