ఎంపీ అభ్య‌ర్థి కోసం వైసీపీ వేట‌

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి కొత్త‌గా ఎంపీ అభ్య‌ర్థి ఒక‌రు అవ‌స‌రం అయ్యేలా ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు ఉన్న ఎంపీల‌ను తీసుకుంటే.. పార్ల‌మెంటు స‌భ్యులుగా 22 మంది ఉన్నా రు. వీరిలో మెజారిటీ అంతా కూడా .. యువ‌కులే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే ఒక‌రిద్ద‌రు మాత్రం వ‌యోభా రంతో ఇబ్బంది ప‌డుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది వారిలోనూ ముఖ్యంగా చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌.. మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని చెబుతున్నారు. దీంతో ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త అభ్య‌ర్థిని వెతుక్కోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని అంటున్నారు.

విష‌యంలోకివెళ్తే.. రాష్ట్రంలోకెల్లా.. చిత్తూరు జిల్లాకు జ‌గ‌న్ స‌ర్కారు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా కావ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి కుప్పం నియోజ‌కవ ర్గంలో టీడీపీ అధినేత ను ఓడించాల‌ని వైసీపీ అధిష్టానం.. కంక‌ణం క‌ట్టుకోవ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డ ఎలాంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. ముందు.. కుప్పం నుంచే ప్రారంభిస్తున్నారు.

అయితే.. ఈ నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు ఎంపీ సీటు ప‌రిధిలోకి వ‌స్తుంది. ఇక్క‌డ ఎంపీగా ఉన్న రెడ్డ‌ప్ప‌.. ఇక్క‌డ యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఎక్కువ సేపు ఆయ‌న ఇంటికే ప‌రిమితం అవుతున్నార‌ని అంటున్నారు. దీంతో కుప్పం స‌హా చిత్తూరు జిల్లాలో ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. ఎంపీ రెడ్డ‌ప్ప డుమ్మా కొడుతున్నారు. ఈ ప‌రిణామాల‌పై ఇప్ప‌టికే జ‌గ‌న్ కొన్ని సూచ‌న‌లు చేశార‌ని.. ఇలా అయితే.. ఎలా? అని కూడా ఆయ‌న‌ను ప్ర‌శ్నించార‌ని.. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటూ.. క‌రోనాకు భ‌య‌ప‌డుతున్నారని.. దీంతో ప‌నులు ముందుకు సాగ‌డం లేద‌ని జ‌గ‌న్‌కు స‌మాచారం అందింది.

ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెడ్డ‌ప్ప‌ను పార్టీకి ప‌రిమితం చేసి..ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కుడికి అవ‌కాశం ఇస్తార‌నేచ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం చిత్తూరు పార్ల‌మెంటు మాత్రమే కాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 10 మంది వైసీపీ సిట్టింగ్ ఎంపీల‌కు టిక్కెట్లు ద‌క్కే ప‌రిస్థితులు అయితే లేవు.