సినిమా వాళ్లకి ఎన్నాళ్లీ టార్చర్‌?

సినిమా వాళ్లకి ఎన్నాళ్లీ టార్చర్‌?

భావ వ్యక్తీకరణ స్వేఛ్ఛని హరించే విధంగా పలుమార్లు సినిమాలకి అధికారులు, న్యాయస్థానాలే అన్యాయం చేసాయి. నచ్చిన పేరు కూడా పెట్టుకోనివ్వకుండా చిన్న చిన్న సంఘాల వాళ్లు ఉనికి చాటుకోవడం కోసం చేసే పనులని గట్టిగా అడ్డుకోవడం, మళ్లీ అలాంటివి ఎవరూ లేవనెత్తకుండా చూడడం చేయకుండా వారికి భయపడి కోట్ల వ్యాపారం చేసిన వారి యోగక్షేమాలు ఆలోచించకుండా సింపుల్‌గా సినిమా రిలీజ్‌ని నిషేధించడం ఏమిటి? స్మార్ట్‌ ఫోన్ల యుగంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నా కానీ ఇలాంటి పనులు మనల్ని రాతి యుగానికి లాక్కుపోతున్నాయి.

సినిమా విడుదల మరో కొద్ది గంటల్లో వుందనగా పేరు మార్చుకుని కొత్త టైటిల్‌ని ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? ఇలా వారితో ప్రకటింప చేయడం వల్ల ఎవరి అహం చల్లబడింది? కోట్లతో వ్యాపారం ముడి పడి వుంది కనుక బ్లాక్‌మెయిలింగ్‌కి దిగి సినిమా వాళ్లతో ఆడుకుంటోన్న ఆటలకి ఎవరూ అడ్డుకట్ట వేయరెందుకని?

చివరి రోజు వరకు విషయాన్ని లాగి, కనీసం సదరు సినిమా కొన్న వారి మంచి, చెడు కూడా ఆలోచించకుండా నిషేధించడం ఎంతవరకు సమంజసం. ఏ అధికారంతో ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చారో వారిపై చర్యలు తీసుకుంటే కానీ మున్ముందు ఇలాంటి ఆర్డర్లు జారీ చేసే వాళ్లు ఒళ్లు దగ్గరుంచుకోరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English