విడ్డూరం.. సైరా ట్రైలర్‌ చూసేందుకు టిక్కెట్టా?

విడ్డూరం.. సైరా ట్రైలర్‌ చూసేందుకు టిక్కెట్టా?

‘బాహుబలి’ స్టయిల్ ఫాలో అవుతూ బుధవారం సాయంత్రం సెలక్టివ్ థియేటర్లలో ‘సైరా’ ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర బృందం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు బెంగళూరు, చెన్నై లాంటి పొరుగు రాష్ట్రాల సిటీల్లోనూ వివిధ థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శించారు.

ఐతే ట్రైలర్ ఉచితంగా చూడొచ్చనే చిత్ర బృందం చెప్పగా.. బెంగళూరులోని ఒక మల్టీప్లెక్స్ మాత్రం మూడు నిమిషాల ట్రైలర్ చూసేందుకు రూ.100 రూపాయలతో టికెట్లు అమ్మి సొమ్ము చేసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంజీ రోడ్డులోని స్వాగత్ శంకర్ నాగ్ అనే థియేటర్లో ఈ విడ్డూరం చోటు చేసుకుంది. టికెట్ల మీద సినిమా పేరును ముద్రించినట్లే.. ‘సైరా ట్రైలర్ లాంచ్’ అని ముద్రించి టికెట్లు విక్రయించడం విశేషం. సోషల్ మీడియాలో ఈ టికెట్లు పెట్టి పెద్ద చర్చకు తెరతీశారు అభిమానులు.

కర్ణాటకలో మెగాస్టార్ చిరంజీవికి మామూలు క్రేజ్ లేదు. అక్కడి స్టార్లను మించి చిరును ఆరాధిస్తారు. చిరు సినిమా విడుదలైతే బెంగళూరు మోతెక్కిపోతుంది. ఇది దశాబ్దాలుగా చూస్తున్న వ్యవహారమే. ‘సైరా నరసింహారెడ్డి’ కర్ణాటక హక్కులు ఏకంగా రూ.30 కోట్ల దాకా పలకడం చిరుకు అక్కడున్న క్రేజ్‌కు నిదర్శనం. ఇంత అంచనాలున్న సినిమా ట్రైలర్ చూసేందుకు బెంగళూరులోని వివిధ థియేటర్లకు మెగా అభిమానులు పరుగులు తీశారు.

ఐతే మూడు నిమిషాల ట్రైలర్‌ను ఉచితంగా ప్రదర్శించడం పోయి.. టికెట్లు పెట్టి షాక్‌కు గురి చేసింది స్వాగత్ మల్టీప్లెక్స్ యాజమాన్యం. మెగా అభిమానులేమో.. చూశారా మా చిరు క్రేజ్, టికెట్లు పెట్టి మరీ ట్రైలర్ చూస్తున్నారని కాలర్ ఎగరేస్తుంటే.. ట్రైలర్ చూపించేందుకు కూడా డబ్బులు వసూలు చేయడమేంటి అంటూ నేరుగా నిర్మాత రామ్ చరణ్‌ను తిట్టిపోస్తున్నారు యాంటీ ఫ్యాన్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English