‘వాల్మీకి’లో నితిన్ పాత్ర ఏంటంటే..?

‘వాల్మీకి’లో నితిన్ పాత్ర ఏంటంటే..?

‘వాల్మీకి’ సినిమాకు ఆకర్షణలు చాలానే జోడించాడు దర్శకుడు హరీష్ శంకర్. తమిళంలో లేని పాత్ర, ఫ్లాష్ బ్యాక్ సృష్టించి పూజా హెగ్డేను తీసుకోవడం.. ఆమె క్రేజ్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ ‘వెల్లువొచ్చి గోదారమ్మా’ పాట తీయడం.. ఒక క్యామియో రోల్ కోసం స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ను ఎంచుకోవడం తెలిసిన విషయాలే. వీరితో పాటు యువ కథానాయకుడు నితిన్ కూడా ఈ చిత్రంలో ఉంటాడని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ దిశగా నితిన్ కూడా ఇంతకుముందు హింట్ ఇచ్చాడు.

ఇప్పుడు ఈ వార్త నిజమే అని రూఢి అయింది. స్వయంగా వరుణ్ తేజే ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘వాల్మీకిలో అతిథి పాత్రలో కనిపించిన మా ‘భీష్మ’కు ధన్యవాదాలు. లవ్ యూ డార్లింగ్’’ అని ట్వీట్ చేసిన వరుణ్.. నితిన్ తన భుజాల మీదికి ఎక్కిన ఒక ఫొటో కూడా షేర్ చేశాడు. ఇందులకు బదులుగా నితిన్.. ‘‘వాల్మీకి సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్. మీ భీష్మ. సెప్టెంబరు 20న గత్తర్ లేపాలె’’ అని ట్వీట్ చేశాడు. మొత్తానికి ‘వాల్మీకి’లో నితిన్ కనిపించనున్న విషయం ఖరారైంది. ఇంతకీ అతను ఏ పాత్ర చేస్తున్నాడన్నది ఆసక్తికరం.

తమిళంలో విజయ్ సేతుపతి చేసిన క్యామియో రోల్‌ను నితిన్ చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో దర్శకుడు కావాలనే ప్రయత్నంలో తిరుగుతుంటాడు. ఓ నిర్మాత ఒక గ్యాంగ్‌స్టర్ కథ రాయమంటే.. విలన్ జీవితాన్ని దగ్గరగా చూసి స్క్రిప్టు తయారు చేద్దామని వెళ్తాడు. చివర్లో విలన్‌లో మార్పు వచ్చి మంచోడైపోతే.. హీరో రౌడీలా తయారై ఓ హీరో దగ్గరికి వెళ్లి అతడిని బెదిరించి తన స్క్రిప్టుతో సినిమా తీయడానికి ఒప్పిస్తాడు. అక్కడ ఆ హీరో విజయ్ సేతుపతి కాగా.. తెలుగులో నితిన్ ఆ క్యామియో రోల్ చేశాడని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English