సరిలేరు నీకెవ్వరు.. ‘ఆగడు’లా కావాలంటున్న నిర్మాత

సరిలేరు నీకెవ్వరు.. ‘ఆగడు’లా కావాలంటున్న నిర్మాత

మహేష్ బాబు కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్లలో ‘ఆగడు’ ఒకటి. మహేష్ బాబు తన కెరీర్లో అత్యంత వైవిధ్యమైన పాత్రలో నటించిన ‘1 నేనొక్కడినే’ డిజాస్టర్ అయ్యాక.. ఒక రకమైన ఫ్రస్టేషన్లో ‘ఆగడు’ లాంటి మాస్ మసాలా సినిమా చేశాడు. కానీ ప్రేక్షకుల్ని మరీ తక్కువ అంచనా వేస్తూ తన సినిమాల్నే ఇటు అటు మార్చి శ్రీను వైట్ల తీసిన ‘ఆగడు’ మహేష్ కెరీర్లోనే ఆ సమయానికి అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా చేయడం మిస్టేక్ అంటూ మహేష్ తర్వాత ఓ సందర్భంలో నిజాయితీగా అంగీకరించాడు.

ఇలాంటి సినిమా గురించి దాని నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర గుర్తు చేసుకుంటూ పాజిటివ్ కామెంట్స్ చేయడం విశేషం. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ను దిల్ రాజుతో కలిసి అనిలే నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఆగడు’ తరహా హైప్ కావాలని అనిల్ కోరుకోవడం విశేషం.

‘ఆగడు’కు బ్యాడ్ రివ్యూలు వచ్చినప్పటికీ. ఓవర్సీస్ బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిందని.. ప్రిమియర్లతోనే 5 లక్షల డాలర్ల మార్కును అందుకున్న తొలి తెలుగు చిత్రం అదేనని అనిల్ సుంకర చెప్పాడు. ‘సరిలేరు నీకెవ్వరు’కు ‘ఆగడు’ స్థాయి హైప్, ‘దూకుడు’ తరహా కంటెంట్ ఉండాలని తాను కోరుకుంటున్నాను.. మీరేమంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటూ అభిమానుల్ని ప్రశ్నించాడు అనిల్. ‘ఆగడు’ విడుదలై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అనిల్ ఈ ట్వీట్ చేయడం విశేషం.

ఐతే ‘దూకుడు’ తరహా కథలు ఇప్పుడు వర్కవుట్ కావడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ అభిమానులు.. మళ్లీ ‘దూకుడు’నే ఇటు తిప్పి అటు తిప్పి సినిమా తీస్తున్నారా అని అనిల్‌ను ప్రశ్నించారు. దీంతో ఆయన తన ట్వీట్‌ను కరెక్ట్ చేశారు. దూకుడు కంటెంట్ అంటే బ్లాక్ బస్టర్ కంటెంట్ అనే తప్ప ‘దూకుడు కంటెంట్’ కాదని చెప్పడం ద్వారా ‘సరిలేరు నీకెవ్వరు’కు ‘దూకుడు’కు పోలిక ఉండదని స్పష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English