మహేష్‌ బావ కథా చిత్రమ్‌!!

మహేష్‌ బావ కథా చిత్రమ్‌!!

ఎస్‌.ఎమ్‌.ఎస్‌ చిత్రంతో హీరోగా పరిచయమైన సుధీర్‌బాబు రెండో చిత్రంతో హిట్‌ అందుకుంటాడా? స్వయంకృషితోనే ఇక్కడ ఎదుగుతానని చెప్పిన సుధీర్‌ తను అనుకున్నది సాధించుకుంటాడా? అంటే..ఆన్సర్‌కి ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. తొలిసినిమా ఎస్‌.ఎం.ఎస్‌కి సుధీర్‌ పరోక్షంగా సగం పెట్టుబడులు పెట్టాడు. కానీ బైటికి చెప్పలేదు. తెరపై పేరేమీ వేసుకోకుండా దాచేశాడు. అయితే సినిమాల్లోకి రాకముందే మూడేళ్లపాటు నటన, ఫైట్స్‌, డాన్సుల్లో తీవ్రంగా శ్రమించి తెరకి పరిచయమయ్యానని చెప్పాడు. ఆ కష్టం చూసే మామగారు సూపర్‌స్టార్‌ కృష్ణ, బావ మహేష్‌ తమ అభిమానులకి సుధీర్‌ని పరిచయం చేశారు. దాంతో తొలిసినిమా బాగానే గట్టెక్కేసింది.

ప్రస్తుతం రెండో చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్‌’ జూన్‌ 7న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా తప్పక సక్సెస్‌ కొడితే సుధీర్‌ స్వయంకృషితో ప్రయత్నించినట్టే. అలాగే ‘ఆడు మగాడురా బుజ్జి’, ‘మాయదారి మల్లిగాడు’ సినిమాల్లో సుధీర్‌ ప్రస్తుతం నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికైతే..‘మహేష్‌ బావ కథా చిత్రమ్‌’ సక్సెసయితే తర్వాతి సినిమాలకు ప్లస్‌ అవునట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు