‘సైరా’ ముందే తీస్తే 500 కోట్లా.. అదెట్టా?

‘సైరా’ ముందే తీస్తే 500 కోట్లా.. అదెట్టా?

‘సైరా నరసింహారెడ్డి’ బడ్జెట్ రూ.300 కోట్లు అని దర్శకుడు సురేందర్ రెడ్డి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. చిరు మీద ఈ దశలో అంత బడ్జెట్ పెట్టడం కరెక్టేనా అన్న డిస్కషన్ నడుస్తోంది ఇండస్ట్రీలో. కానీ ఆ బడ్జెట్ ఎంత వరకు కరెక్టో తెలియదు కానీ.. ఆ మేరకు బిజినెస్ చేసుకోవడంలో మాత్రం నిర్మాత రామ్ చరణ్ విజయవంతం అయ్యాడు. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులే రూ.125 కోట్ల మొత్తానికి అమ్ముడైనట్లు చెబుతున్నారు. థియేట్రికల్ హక్కుల రేటు రూ.190 కోట్ల పైమాటే అంటున్నారు. మొత్తానికి బడ్జెట్‌ను మించి సినిమాకు బిజినెస్ జరిగినట్లే ఉంది.

ఐతే తాజాగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సైరా’కు రూ.300 కోట్ల బడ్జెట్ అంటే తక్కువే అంటున్నాడు. దీన్ని కొన్నేళ్ల ముందు తీసి ఉంటే రూ.500 కోట్ల దాకా ఖర్చయ్యేదని.. పైగా ఇప్పుడు వచ్చినంత క్వాలిటీ ఔట్ పుట్ కూడా వచ్చేది కాదని సురేందర్ చెప్పడం విశేషం.

ఐతే ఉయ్యాలవాడ కథను చిరు పదేళ్ల ముందు చేయాలనుకున్నపుడు బడ్జెట్ లెక్క వేస్తే రూ.70-80 కోట్ల మధ్య తేలిందట. కానీ అప్పటికి తెలుగు సినిమా మీద గరిష్టంగా పెడుతున్న ఖర్చుతో పోలిస్తే రెట్టింపు అవుతోందని ఆ సినిమా ఆపేసినట్లు చిరునే స్వయంగా వెల్లడించాడు. ఇప్పుడు రెమ్యూనరేషన్లు సహా అన్ని రకాల ఖర్చులు పెరిగాయి కాబట్టి ‘సైరా’కు రూ.300 కోట్లు ఖర్చయిందంటున్నారు. పదేళ్ల ముందు రాజమౌళి రూ.50 కోట్ల ఖర్చుతో ‘మగధీర’ లాంటి అద్భుత చిత్రాన్ని అదిరిపోయే క్వాలిటీతో తీశాడు. మరి ‘సైరా’ను కొన్నేళ్ల ముందు తీస్తే రూ.500 కోట్లు ఖర్చయ్యేదని, అయినా ఇప్పుడొచ్చినంత క్వాలిటీ ఉండేది కాదని సురేందర్ చెప్పడం అతిశయోక్తే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English