వాల్మీకి జోరు బాగుందండోయ్‌

వాల్మీకి జోరు బాగుందండోయ్‌

సినిమాలకి అంతగా అనుకూలమైన సీజన్‌ కాకపోయినా కానీ భారీ చిత్రాలు అటు, ఇటు వస్తుండడంతో ఈ టైమ్‌ని కూడా నిర్మాతలు వినియోగించుకోక తప్పడం లేదు. అయితే బ్యాడ్‌ సీజన్‌లో వస్తున్నా కానీ 'వాల్మీకి' జోరు బాగానే వుందని అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చెబుతున్నాయి. ఈ చిత్రానికి అంతటా డీసెంట్‌ బుకింగ్స్‌ జరుగుతున్నాయి. ఎలాగో మాస్‌ సినిమా కనుక సింగిల్‌ థియేటర్లు, సి క్లాస్‌ సెంటర్లలో థియేటర్ల వద్ద తొలి రోజు హడావిడి బాగానే వుంటుంది. కాబట్టి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఈ చిత్రానికి బోనస్‌ అవుతాయి.

మాస్‌ పల్స్‌ తెలిసిన హరీష్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని మాస్‌ని ఆకట్టుకునేలా మార్కెట్‌ చేస్తూ వచ్చాడు. టీజర్‌, ట్రెయిలర్‌ అన్నీ మాస్‌ జనాలని ఆకట్టుకునేలా రూపొందించాడు. ఇక సినిమా విడుదలకి సరిగ్గా రెండు రోజుల ముందు బ్రహ్మాస్త్రం లాంటి 'వెల్లువొచ్చే గోదారమ్మా' పాట రీమిక్స్‌ వదిలాడు. దీంతో ఈ చిత్రం పట్ల మిడిల్‌ ఏజ్‌ ఆడియన్స్‌ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ బజ్‌తో కనుక ఈ చిత్రం డీసెంట్‌ అనే టాక్‌ తెచ్చుకున్నా కానీ వాల్మీకి చెలరేగిపోతాడు. సైరా వచ్చే వరకు మరో చిత్రమేదీ అడ్డు రాదు కనుక వాల్మీకికి ఇంతకంటే మంచి తరుణం వెతికినా దొరకదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English