సైరాకోసం దిగిన పెద్ద తలకాయలు!

సైరాకోసం దిగిన పెద్ద తలకాయలు!

రామ్‌ చరణ్‌ గుడ్‌విల్‌తో పాటు ఇండస్ట్రీలో తనకున్న కనక్షన్స్‌, రిలేషన్స్‌ 'సైరా' ప్రమోషన్‌కి అక్కరకు వస్తున్నాయి. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ 'సైరా' ట్రెయిలర్‌ని ట్వీట్‌ చేస్తూ చరణ్‌, చిరంజీవి ఇద్దరికీ శుభాకాంక్షలు అందజేసాడు. ఇంతవరకు సైరాని పట్టించుకోని హిందీ సినిమా ప్రియుల దృష్టిని ఈ ట్వీట్‌ ఇన్‌స్టంట్‌గా ఆకర్షిస్తోంది. బాలీవుడ్‌ వెర్షన్‌కి భాయ్‌ ఆశీస్సులు ఖచ్చితంగా ప్లస్‌ అవుతాయి.

ఇదిలావుంటే ఇటీవల ఇతర సినిమాల గురించి పబ్లిగ్గా స్పందించడం మానేసిన రాజమౌళి 'సైరా' ట్రెయిలర్‌పై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం తాను రామ్‌ చరణ్‌తో సినిమా చేస్తున్నది ఒక కారణం అనుకుంటే, మగధీర తర్వాత రాజమౌళితో వచ్చిన దూరాన్ని పూర్తిగా తగ్గించుకుని మళ్లీ అతనికి బాగా క్లోజ్‌ అయిపోవంలో చరణ్‌ చేసిన కృషి కూడా ఈ బంధం బలపడడానికి కారణమయింది.

మెగాస్టార్‌ చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కనుక తెలుగు సినిమా సెలబ్రిటీలు అందరూ సైరాకి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ చిత్రానికి ఎవరూ అడ్డు రాకుండా బాక్సాఫీస్‌ వద్ద ఫ్రీ స్పేస్‌ ఇచ్చేస్తూ మిగతా సినిమాల వారందరూ వెనక్కి వెళ్లారు. బాహుబలి, సాహో లాంటి భారీ చిత్రాలకి ఇచ్చిన రెస్పెక్ట్‌ని ఇతర ప్రొడ్యూసర్స్‌ సైరాకి కూడా పుష్కలంగా ఇస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English