నాగ చైతన్య నుంచి నాగశౌర్యకి!

నాగ చైతన్య నుంచి నాగశౌర్యకి!

'ఛలో'తో సూపర్‌హిట్‌ కొట్టి, ఆ తర్వాత 'నర్తనశాల'తో డౌట్‌లో పడ్డ నాగశౌర్య అక్కడ్నుంచీ జాగ్రత్త పడుతున్నాడు. బ్యానర్‌ వేల్యూ వున్న చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోన్న నాగశౌర్య త్వరలో దిల్‌ రాజు నిర్మాణంలో ఒక చిత్రం చేయనున్నాడు. అయితే ఈలోగా అతను లక్ష్మీ సౌజన్య అనే లేడీ డైరెక్టర్‌తో ఒక చిత్రం చేయబోతున్నాడు. టయర్‌ 2 స్టార్స్‌తో వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో ఈ చిత్రం రూపొందనుంది. అక్టోబర్‌లో షూటింగ్‌ జరుపుకునే ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో కృష్ణవంశీ, శేఖర్‌ కమ్ముల వద్ద శిష్యరికం చేసిన సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది.

గతంలో ఈమె డైరెక్షన్‌లోనే నాగ చైతన్య హీరోగా సితార సంస్థలో సినిమా వుంటుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు చైతన్య స్థానంలోకి శౌర్య వచ్చాడు. మరి అదే కథతో తీస్తున్నారా లేక ఇప్పుడు వేరే కథ ఏదైనా సిద్ధం చేస్తున్నారా అనేది తెలియదు. త్రివిక్రమ్‌తో మాత్రమే సినిమాలు తీసే హారిక హాసిని క్రియేషన్స్‌కి అనుబంధ సంస్థ అయిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ప్రస్తుతం భీష్మ షూటింగ్‌ జరుపుకుంటోంది. డిసెంబర్‌లో విడుదలయ్యే ఈ చిత్రం తర్వాత నితిన్‌ ఇదే బ్యానర్‌లో రంగ్‌ దే చేయబోతున్నాడు. అలాగే నాని-సుధీర్‌వర్మ కాంబినేషన్‌లో ఒక చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English