సైరా కుంభస్థలం కొట్టేసిందిగా!

సైరా కుంభస్థలం కొట్టేసిందిగా!

హిందీ మార్కెట్‌లో సైరా చిత్రానికి తగిన క్రేజ్‌ ఏర్పడుతుందా లేదా అనేది మొదట్నుంచీ నిర్మాత రామ్‌ చరణ్‌ని వేధిస్తూ వచ్చింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ కోసం మొదట్లో ఎవరూ రాకపోతే చరణ్‌ కాస్త కలవరపడ్డాడు. మొత్తానికే హిందీ రిలీజ్‌ కాన్సిల్‌ చేసేయాలని కూడా భావించాడు. అయితే సినిమా పూర్తయిన తర్వాత ఎడిట్‌ చూసుకుని ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వారికి పిలిచి చూపించారు. వారు ఒకే సిట్టింగ్‌లో డీల్‌ కుదుర్చుకున్నారు. అయినా కానీ ప్రేక్షకుల వైపు నుంచి ఆసక్తి వుంటుందా అనేది అనుమానంగా మారింది. కానీ టీజర్‌తో ఆకట్టుకున్న సైరా ట్రెయిలర్‌కి కూడా హిందీ వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

తెలుగు ట్రెయిలర్‌కి అయిదు మిలియన్లకి పైగా వ్యూస్‌ వస్తే, హిందీ ట్రెయిలర్‌ కూడా అయిదు మిలియన్ల మార్కు దాటింది. తెలుగుతో సమానంగా హిందీ ట్రెయిలర్‌కి కూడా స్పందన వుందంటే సైరా కుంభస్థలం కొట్టినట్టే. ఇక నార్త్‌ ఆడియన్స్‌ రెస్పాన్స్‌ కూడా సానుకూలంగానే వుంది. దక్షిణాది వారు అద్భుతమైన సినిమాలు తీస్తున్నారంటూ కితాబులు ఇస్తున్నారు. అక్టోబర్‌ 2న విడుదలయ్యే 'వార్‌' ట్రెయిలర్‌తో పోల్చి 'సైరా' చాలా బాగుందని, ఆ రోజున ముందుగా ఈ చిత్రాన్నే చూస్తామని కూడా పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా నిజంగా సస్టెయిన్‌ అయితే హిందీ వెర్షన్‌కి కూడా మంచి ఓపెనింగ్‌ రావడానికి స్కోప్‌ లేకపోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English