చీప్ అండ్ బెస్ట్ వదిలేసి.. అతడికి మూడు కోట్లా?

చీప్ అండ్ బెస్ట్ వదిలేసి.. అతడికి మూడు కోట్లా?

రాజమౌళి సినిమా అంటే కీరవాణిలోని అత్యుత్తమ సంగీత దర్శకుడు బయటికి వస్తాడు. సుకుమార్ సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ తన బెస్ట్ ఔట్ పుట్ ఇస్తాడు. ఇలాగే అనూప్ రూబెన్స్‌లోని బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బయటికి రావాలంటే విక్రమ్ కె.కుమార్‌తో సినిమా చేయాలి. అప్పటిదాకా మామూలుగా బండి లాగించేస్తున్న అనూప్ నుంచి ఇష్క్ లాంటి అద్భుతమైన ఆల్బం రాబట్టకున్న ఘనత విక్రమ్‌దే. ఆ సినిమా ఆడియో విని ఔరా అనుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆ సమయానికి అనూప్ కెరీర్లో అదే బెస్ట్ ఆడియో.

ఆ తర్వాత ‘మనం’ సినిమాతో మళ్లీ మెస్మరైజ్ చేశాడు. విక్రమ్ కోసం మరో మరపురాని ఆల్బం ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలూ అంత పెద్ద హిట్ కావడానికి ఆడియోలు కూడా ముఖ్య కారణమే. విక్రమ్-అనూప్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ‘హలో’ హిట్ కాకపోయి ఉండొచ్చు. కానీ దాని ఆడియో కూడా సూపరే.

విక్రమ్ కోసం మూడు అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు అనూప్. అతడి రేటు కూడా తక్కువే. దేవిశ్రీ ప్రసాద్, అనిరుధ్ రవిచందర్‌ల మాదిరి రూ.3 కోట్లు డిమాండ్ చేయడు. సగం రేటుకే పని చేస్తాడు. ఐతే ఈ మధ్య అతడి ఫామ్ కొంచెం దెబ్బ తింది. సినిమాలు తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలోనే అనూప్‌ను విక్రమ్ విడిచిపెట్టేశాడు.

తన కొత్త సినిమా ‘గ్యాంగ్ లీడర్’కు నాని రెకమండేషన్ మీద అనిరుధ్‌‌ను తీసుకున్నాడు. రెమ్యూనరేషన్ మూడు కోట్లట. ఆడియో చూస్తే ఆ రేటుకు తగ్గట్లు లేదు. హొయన హొయనా మినహా పాటలు సాధారణమే. ఆడియో మరీ తీసి పడేసేలా లేదు కానీ.. అనిరుధ్ నుంచి ఆశించే స్థాయిలో మాత్రం లేదు. విక్రమ్‌కు అనూప్ ఇచ్చిన ఆడియోల ముందు ఇది ఎంతమాత్రం నిలవలేదు. చీప్ అండ్ బెస్ట్‌లో అనూప్ అదిరిపోయే సంగీతం అందిస్తుంటే అతడిని కాదని.. అనిరుధ్‌కు అంత రేటు పెట్టి మామూలు ఆడియోతో సరిపెట్టుకోవాల్సి రావడం పట్ల విక్రమ్ ఇప్పుడు కచ్చితంగా రిగ్రెట్ అవుతుండాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English