సాహోతో ప్రభాస్‌కు జరిగిన ఏకైక మేలు

సాహోతో ప్రభాస్‌కు జరిగిన ఏకైక మేలు

సాహో సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తయింది. ఇంకా కొన్ని చోట్ల సినిమా నడుస్తోంది కానీ.. షేర్ గురించి మాట్లాడే పరిస్థితే లేదు. అది నామమాత్రంగా ఉంటోంది. కొన్ని షోలకు వస్తున్న కలెక్షన్లు థియేటర్ల మెయింటైనెన్స్‌కు కూడా సరిపోవట్లేదు. కాబట్టి సినిమా కథ మగిసిందనే అనుకోవాలి. తెలుగు రాష్ట్రాల బయ్యర్లు దాదాపు రూ.40 కోట్ల దాకా నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు.

తమిళనాడు, కేరళల్లో పెట్టుబడిలో 40 శాతం మాత్రమే రికవర్ అయినట్లు అంచనా. కర్ణాటక, ఓవర్సీస్‌లోనూ భారీ నష్టాలే మిగిలాయి. కానీ ఒక్క చోట మాత్రం సాహో హిట్ స్టేటస్ అందుకుంది. సాహో హిందీ వెర్షన్ రూ.150 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం విశేషం. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న మన సినిమా ఉత్తరాదిన ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం అనూహ్యమే.

‘బాహుబలి’ సినిమాతో ఉత్తరాదిన ప్రభాస్‌కు ఎలాంటి ఇమేజ్ వచ్చిందో చెప్పడానికి ‘సాహో’నే రుజువు. ‘బాహుబలి’ అంతా రాజమౌళి ఘనతే అని.. ఆ సినిమాలో హీరో కాబట్టి ప్రభాస్‌ను చూశారు తప్పితే.. నార్త్ ఇండియాలో అతను సొంతంగా ఇమేజ్, మార్కెట్ ఏమీ పెంచుకోలేదని అన్నవాళ్లకు ‘సాహో’ సమాధానంగా నిలిచింది. హిందీలో ఈ చిత్రాన్ని సమీక్షకులు ఏకిపడేశారు. మీడియా కూడా విపరీతమైన నెగెటివ్ ప్రచారం చేసింది. అయినప్పటికీ అక్కడి ప్రేక్షకులు ‘సాహో’ను ఎగబడి చూశారని వసూళ్లు చాటి చెబుతున్నాయి.

ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఉత్తరాదిన ప్రభాస్ పెద్ద స్టార్ అని ‘సాహో’ రుజువు చేసింది. ఈ సినిమాతో అతడి మార్కెట్ అక్కడ మరింత బలపడింది. నెగెటివ్ టాక్ ఉన్న సినిమాతోనే ఇలా వసూళ్లు సాధించాడంటే.. మంచి కంటెంట్ ఉన్న సినిమా పడితే పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English