మళ్లీ ముడుచుకుపోయిన పవన్‌కళ్యాణ్‌

మళ్లీ ముడుచుకుపోయిన పవన్‌కళ్యాణ్‌

తిరిగి నటించాలనే కోరిక వుందో లేదో అనేది స్పష్టం చేయకుండా, తనకి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలకి డబ్బులు వాపసు ఇవ్వకుండా పవన్‌కళ్యాణ్‌ ఇంకా దాగుడుమూతా దండాకోర్‌ అంటూ నిర్మాతలకి ఆశలు పెడుతూనే వున్నాడు. అసలు సినిమాలు తిరిగి చేయనంటూ డబ్బులు తిరిగి ఇచ్చేస్తే పోయే దానికి అవి ఇవ్వకుండా, ఇంకా నటించాలనే కోరిక తనలో వుందనే సంకేతాలు పంపిస్తున్నాడు.

దీంతో పవన్‌ అందుబాటులోకి వచ్చినపుడల్లా దొరికిన దర్శకులని పట్టుకుపోయి సినిమా చేద్దామని నిర్మాతలు అడుగుతున్నారు. ఆ వార్తలు ఆ నోటా ఈ నోటా మీడియాలో రాగానే అభిమానులు ఇక పార్టీ వ్యవహారాలు చూసుకోమని ట్విట్టర్‌ ద్వారా చెబుతున్నారు. దీంతో పవన్‌ ముడుచుకుపోతున్నాడు. అభిమానులు అదే పనిగా రిక్వెస్ట్‌లు పెడితే వాళ్లు పిలుస్తున్నారు కనుక మరో సినిమా చేస్తున్నా అని చెప్పవచ్చు.

కానీ ఫాన్సే ఇక పవన్‌ రాజకీయాలకే పరిమితం కావాలని అనుకుంటున్నారు. కనీసం డెబ్బయ్‌ శాతం ఫాన్స్‌ అయినా ఇదే కోరిక వెలిబుచ్చుతున్నారు కనుక ఇప్పుడు తిరిగి రావడం సబబు కాదని పవన్‌ అర్థం చేసుకున్నాడు. అయితే పవన్‌ మళ్లీ మనసు మార్చుకోడా అంటూ నిర్మాతలయితే అడ్వాన్సులు తిరిగి ఇమ్మని డిమాండ్‌ చేయకుండా ఎదురు చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English