బోయపాటి తర్వాత పూరీతోనేనా?

బోయపాటి తర్వాత పూరీతోనేనా?

నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ఎవరితో జట్టు కడతాడో అర్థం కాదు. ఈ విషయంలో బాలయ్యను అంచనా వేయడం కష్టం. ఫామ్, రేంజ్ చూడకుండా దర్శకులకు కమిట్మెంట్ ఇచ్చేస్తుంటాడాయన. గత పదేళ్లలో ఇలా బాలయ్య ఎన్నోసార్లు ఆశ్చర్యపరిచాడు. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న పూరి జగన్నాథ్‌కు రెండేళ్ల కిందట అవకాశమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

అప్పటికి పూరి ట్రాక్ రికార్డు బాగాలేదు. పైగా బాలయ్య శైలికి పూరితో సినిమానూ ఊహించలేం. కానీ వాళ్లిద్దరి కలయికలో ‘పైసా వసూల్’ అనే సినిమా తెరకెక్కింది. ఆ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ.. అందులో బాలయ్య చాలా హుషారుగా నటించి అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. తేడా సింగ్ క్యారెక్టర్ బాలయ్యకు కొత్తగా అనిపించింది కూడా.

ఆ సినిమాకు అభిమానుల నుంచి వచ్చిన స్పందన చూసి.. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పూరీతో ఇంకో చిత్రం చేయడానికి బాలయ్య రెడీగానే ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ కాంబినేషన్లో రెండో సినిమా ఇదిగో అదిగో అన్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఐతే వచ్చే ఏడాది వీళ్లిద్దరూ కలిసి కచ్చితంగా సినిమా చేస్తారన్నది తాజా సమాచారం. ఇటీవల బాలయ్యకు పూరి ఒక లైన్ చెప్పి కమిట్మెంట్ తీసుకున్నాడట.

‘పైసా వసూల్’తో నష్టపోయిన నిర్మాత ఆనంద్ ప్రసాద్‌కే ఈ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం బాలయ్య కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత బోయపాటి చిత్రం మొదలవుతుంది. ఈలోపు పూరి విజయ్ దేవరకొండ సినిమాను పూర్తి చేస్తాడు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో వీళ్లిద్దరి కలయికలో కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English