సైరా హోల్ సేల్ రేటు రూ.125 కోట్లు

సైరా హోల్ సేల్ రేటు రూ.125 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఇప్పటికీ తగ్గలేదని చాటుతోంది ‘సైరా’ సినిమా. ఈ వయసులో, చిరు కెరీర్లో ఈ దశలో రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి సినిమా తీయడమంటే మాటలు  కాదు. ఊరికే ఖర్చు పెట్టేయడమే కాదు.. ఆ బడ్జెట్‌కు తగ్గట్లు బిజినెస్ కూడా చేసుకోవడంలో రామ్ చరణ్ అండ్ టీమ్ విజయవంతమవుతోంది.

ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని రూ.190 కోట్ల మేర అమ్మినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ‘సైరా’ శాటిలైట్, డిజిటల్ హక్కులు ఏకంగా రూ.125 కోట్లకు అమ్ముడైనట్లుగా వస్తున్న సమాచారం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘బాహుబలి’; ‘సాహో’ కాకుండా దక్షిణాది మొత్తంలో ఏ చిత్రానికీ శాటిలైట్, డిజిటల్ హక్కులు ఈ స్థాయి రేటు పలకలేదు. దీన్ని బట్టి చిరు స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

జీ నెట్ వర్క్ వాళ్లు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ.. ఈ ఐదు భాషలకూ కలిపి ‘సైరా’ హక్కుల్ని రూ.125 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఐదు భాషల్లో శాటిలైట్, డిజిటల్ హక్కులకు ఆ రేటు పెట్టడం వల్ల తమకు బాగానే గిట్టుబాటు అవుతుందని ఆ సంస్థ భావిస్తోంది. తెలుగు వెర్షన్ కోసమే శాటిలైట్, డిజిటల్ హక్కులకు రూ.40 కోట్ల దాకా పెట్టొచ్చు.

ఇంకో నాలుగు భాషలకు కలిపి.. రూ.85 కోట్లు పెడుతున్నారు. హిందీలో చిన్నా చితకా హీరోల సినిమాల డబ్బింగ్ హక్కులకే రూ.10 కోట్లకు అటు ఇటుగా రేటు పలుకుతున్న నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ కూడా నటించిన ‘సైరా’కు ఎక్కువ రేటే పెట్టొచ్చు. డిజిటల్ హక్కుల కోసం అమేజాన్ ప్రైమ్ నుంచి కూడా మంచి ఆఫర్ వచ్చినప్పటికీ.. శాటిలైట్ కూడా కలిపి ఒకేసారి డీల్ సెట్ కావడం, మంచి రేటు రావడంతో చరణ్ జీ నెట్ వర్క్ వాళ్లకే హక్కులు కట్టబెట్టేశాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English