హరీష్ శంకర్ స్పీచ్.. రైటర్ కమ్ లిరిసిస్ట్ ఉద్వేగం

హరీష్ శంకర్ స్పీచ్.. రైటర్ కమ్ లిరిసిస్ట్ ఉద్వేగం

‘వాల్మీకి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు హరీష్ శంకర్ స్పీచ్.. సూపర్ హిట్టయింది. యూట్యూబ్‌లో అది రెండు రోజులుగా టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. హరీష్ ఎంతటి మాటకారో గతంలో చాలాసార్లు చూశాం. నిజానికి అతడి సినిమాల కన్నా కూడా స్పీచులు చాలా బాగుంటాయని అంటారు జనాలు. హరీష్ సినిమాల్లో కొన్ని బాగుంటాయి. కొన్ని ఫెయిలవుతుంటాయి. కానీ స్పీచులు మాత్రం అన్నీ బాగుంటాయి.

‘వాల్మీకి’ ఈవెంట్లో దాదాపు 20 నిమిషాలు మాట్లాడాడు హరీష్. అందులో లిరిసిస్టుల గురించి అతను చేసిన ప్రసంగం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. మన కవుల్ని, గేయ రచయితల్ని మనం గౌరవించుకోవడం లేదంటూ అతను ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తాడు. సినిమాల వేడుకలు జరిగినపుడు.. నటీనటులు, టెక్నీషియన్లలో చాలామందికి ప్రాధాన్యం దక్కుతుందని.. కానీ లిరిసిస్టులకు మాత్రం తగిన ప్రాధాన్యం దక్కదని ఆవేదన వ్యక్తం చేశాడు హరీష్. ఈ తప్పు తన సినిమాల వేడుకల్లో కూడా జరిగి ఉంటుందని అన్నాడు హరీష్.

అందుకే తన వేడుకలో ముందు లిరిసిస్టులతో మాట్లాడించానని.. ఇకపై అందరూ ఇలాగే చేయాలని కోరాడు హరీష్. దీంతో పాటు జనాలు కూడా గేయ రచయితల గొప్పదనాన్ని గుర్తించాలని.. వాళ్లు పాటల్లో రాసిన గొప్ప వాక్యాల్ని షేర్ చేయాలని కోరాడు. ఈ సందర్భంగా ‘వాల్మీకి’కి సాహిత్యం అందించిన లిరిసిస్టులందరినీ అతను కొనియాడాడు. హరీష్ ప్రసంగం టాలీవుడ్ లిరిసిస్టులందరినీ ఉద్వేగానికి గురి చేసింది. అందరూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

గేయ రచయితగానే కాక మాటల రచయితగానూ ప్రతిభ చాటుకున్న కిట్టు విస్సాప్రగడ.. ట్విట్టర్లో చాలా ఎమోషనల్ అయ్యాడు. సినిమా వేడుకలకు వెళ్లినపుడు ఎదురైన అవమానాల్ని గుర్తు చేసుకున్నాడు. ముందు వరుసలో కూర్చుంటే.. ఇక్కడెందుకు అని పది వరసలు అవతలకి పంపించడం, వేదిక మీద ఎక్కడో ఒక మూలన చోటివ్వడం లాంటి అనుభవాలు లెక్కలేనన్ని జరిగాయని చెప్పాడు. ఈ నేపథ్యంలో హరీష్ ప్రసంగం తననెంతో ఆనందాన్నిచ్చిందని, ఉద్వేగానికి గురి చేసిందని అతను చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English