శ్రీముఖిని కాపాడేందుకు బాబా ఎంత పెద్ద త్యాగం చేశాడో..

శ్రీముఖిని కాపాడేందుకు బాబా ఎంత పెద్ద త్యాగం చేశాడో..

‘బిగ్ బాస్’ మూడో సీజన్ తాజా ఎపిసోడ్లో చిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సీజన్లో టైటిల్‌కు గట్టి పోటీదారుల్లో ఒకరిగా కనిపిస్తున్న శ్రీముఖికి ‘బిగ్ బాస్’ పెద్ద షాకే ఇచ్చాడు. విచిత్రమైన రీతిలో ఆమెను ఎలిమినేషన్‌కు నామినేట్ చేశాడు. హౌస్‌లో ఉన్న టెలిఫోన్ బూత్‌లో ఫోన్ మోగగా.. దగ్గర్లో ఉన్న శ్రీముఖి వచ్చి కాల్ రిసీవ్ చేసుకోబోతే.. ఫోన్ ఎత్తినందుకు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పి ఆమెకు పెద్ద షాకిచ్చాడు బిగ్ బాస్. ఆమె కంటే కూడా ప్రేక్షకులు ఎక్కువ షాకయ్యారు.. ఫోన్ ఎత్తితే నామినేషన్ ఏంటి అని.

ఇక ఆమె నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి బిగ్ బాస్ పెట్టిన మెలిక మరీ విచిత్రం. ఎప్పుడూ గడ్డంతో కనిపించే బాబా భాస్కర్‌‌ను క్లీన్ షేవ్ చేసుకోవడానికి ఒప్పిస్తే మీ నామినేషన్ రద్దవుతుంది అని శ్రీముఖికి చెప్పాడు బిగ్ బాస్.

ఐతే బాబా భాస్కర్‌ను చాలా ఏళ్లుగా చూస్తున్నారు తమిళ, తెలుగు ప్రేక్షకులు. కానీ ఎప్పుడూ అతను గడ్డం తీసి కనిపించింది లేదు. అది అతడికో ఐడెంటిటీ. భాస్కర్‌ను గుర్తు చేసుకుంటే ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తాడు. ఎప్పుడూ గడ్డం తీసి కనిపించని భాస్కర్.. శ్రీముఖి కోసం ఎక్కడ షేవ్ చేసుకుంటాడులే అని అంతా అనుకున్నారు. శ్రీముఖి ఎలిమినేషన్ రేసులో నిలవడం ఖాయమని అనుకున్నారు.

కానీ భాస్కర్‌ను టెలిఫోన్ బూత్‌లోకి పిలిచి.. బిగ్ బాస్ తనకు పెట్టిన కండిషన్‌ గురించి చెప్పింది శ్రీముఖి. ముందు గట్టిగా నవ్విన భాస్కర్.. ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్లిపోయాడు. ఆమె ప్రతిపాదనకు నో అన్నాడనిపించింది. కానీ కొన్ని నిమిషాల్లో ట్రిమ్మర్ తీసుకుని బయటికి వచ్చిన అతను.. రాహుల్ సిప్లిగంజ్ సాయంతో గడ్డంతో పాటు మీసం కూడా తీయించేసుకోవడం విశేషం. ఇలా చేస్తున్నపుడు శ్రీముఖి అపరాధ భావంతో భాస్కర్‌కు సారీ కూడా చెప్పింది. మొత్తానికి తన ఐడెంటిటీ అయిన గడ్డం తీయించుకుని శ్రీముఖిని సేవ్ చేశాడంటే భాస్కర్‌ మంచోడే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English