ఇతనైనా బ్రహ్మిని బతికిస్తాడా?

ఇతనైనా బ్రహ్మిని బతికిస్తాడా?

దాదాపు మూడు దశాబ్దాల పాటు టాప్ కమెడియన్‌గా తెలుగు సినిమాను ఏలాడు బ్రహ్మానందం. పదుల సంఖ్యలో కమెడియన్లు ఉన్న రోజుల్లో కూడా ఆయన హవాకు ఢోకా లేకపోయింది. సునీల్, వేణుమాధవ్ లాంటి కమెడియన్లు.. ఒకానొక దశలో బ్రహ్మికి గట్టి పోటీ ఇచ్చారు. ఆయన్ని డామినేట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయినా బ్రహ్మి తట్టుకున్నాడు. మధ్య మధ్యలో కొంచెం డౌన్ అయినా పుంజుకున్నాడు. తిరిగి ఆధిపత్యాన్ని చాటాడు.

తెలుగు సినీ చరిత్రలోనే మరే కమెడియన్‌కూ సాధ్యం కాని ఇమేజ్ సంపాదించాడు. 60 ఏళ్ల వయసులో.. సోషల్ మీడియాలో ఆయనకు వచ్చిన క్రేజ్.. ఈ తరం యువ ప్రేక్షకుల్లో ఆయన సంపాదించిన ఫాలోయింగ్ చూసి అందరూ షాకయ్యారు ఒక టైంలో. కానీ అంత ఆధిపత్యం చలాయించిన బ్రహ్మి.. రెండు మూడేళ్లుగా సోదిలో లేకుండా పోయాడు.

వరుసగా బ్రహ్మి క్యారెక్టర్లు తేలిపోవడం, ఆయన్ని పీక్స్‌కు తీసుకెళ్లిన దర్శకులే కామెడీ పండించడంలో విఫలం కావడంతో బ్రహ్మి ఉన్నట్లుండి డౌన్ అయిపోయాడు. అలా పడుతూ పడుతూ పోయాడే తప్ప ఇక లేవలేదు. ఒకప్పుడు బ్రహ్మి లేకుండా ఏ పెద్ద సినిమా తెరకెక్కేది కాదు. ఇప్పుడు బ్రహ్మి అనేవాడు ఎవరికీ గుర్తు కూడా రావడం లేదు. బ్రహ్మి ఏదైనా సినిమాలో కనిపిస్తే ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు బ్రహ్మి లేకుండా సినిమా తీయని దర్శకులు కూడా ఆయన్ని విడిచిపెట్టేశారు.

ఈ స్థితిలో ఆయనకు మళ్లీ ఎవరు లైఫ్ ఇస్తారా అని అనుకుంటుంటే.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ సాహసానికి పూనుకున్నాడు. ‘వాల్మీకి’లో బ్రహ్మికి కాస్త ప్రాధాన్యమున్న పాత్రే ఇచ్చాడట హరీష్. ఇంతకుముందు ‘గబ్బర్ సింగ్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ లాంటి సినిమాల్లో బ్రహ్మికి మంచి క్యారెక్టర్లు ఇచ్చి వినోదం పండించాడు హరీష్. ఇప్పుడు ఎవరూ పట్టించుకోని స్థితిలో బ్రహ్మికి బ్రేక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. మరి ఈ చిత్రమైనా బ్రహ్మి కెరీర్‌కు మళ్లీ కాస్త ఊపు తెస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English