సైరా ప్రి రిలీజ్.. ఏమిటీ క‌న్ఫ్యూజ‌న్‌?

సైరా ప్రి రిలీజ్.. ఏమిటీ క‌న్ఫ్యూజ‌న్‌?

మెగా అభిమానుల దృష్టంతా ఇప్పుడు సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం మీదే ఉంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా, అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌రు 2న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఐతే రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా.. ప్ర‌మోష‌న్లు ఊపందుకోక‌పోవ‌డం అభిమానుల్ని క‌ల‌వ‌రపెడుతోంది. విడుద‌ల‌కు అటు ఇటుగా రెండు వారాల స‌మ‌య‌మే ఉండ‌గా.. ఇప్ప‌టిదాకా సినిమా నుంచి ఒక పాట కూడా విడుద‌ల కాలేదు. ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేయ‌లేదు.

ఐతే ఈ నెల 18న హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియం వేదిక‌గా భారీ ఎత్తున ప్రి రిలీజ్ ఈవెంట్ చేయ‌బోతున్నార‌ని, ఆ వేడుక‌లోనే ట్రైల‌ర్ లాంచ్ చేస్తార‌ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ స్వ‌యంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈ వేడుక విష‌యంలో సందేహాలు ముసురుకున్నాయి.

హైద‌రాబాద్‌లో వ‌ర్షాలు ప‌డుతుండ‌టం, బుధ‌వారం జ‌ర‌గాల్సిన ఈవెంట్‌కు కూడా వ‌ర్ష సూచ‌న ఉండ‌టం.. దీనికి తోడు సోమ‌వారం మాజీ స్పీక‌ర్, మంత్రి కోడెల శివ‌ప్ర‌సాదరావు లాంటి పెద్ద నేత చ‌నిపోయిన నేప‌థ్యంలో బుధ‌వారం ఈవెంట్ చేయొద్ద‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా స‌మాచారం.

18న ట్రైల‌ర్ మాత్రం లాంచ్ చేసి.. 22న ప్రి రిలీజ్ ఈవెంట్ చేయాల‌ని ఉద‌యం నుంచి చ‌ర్చ‌లు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వేడుక‌కు అమితాబ్ బ‌చ్చ‌న్ స‌హా వేర్వేరు ప్రాంతాల నుంచి న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. ఈవెంట్ మారిస్తే వాళ్ల షెడ్యూళ్లు కూడా మార‌తాయి. దీంతో వెంట‌నే అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ చేయ‌ట్లేదు. ఐతే ఈవెంట్ య‌థాత‌థంగా జ‌రుగుతుందా.. డేట్ మారుతుందా అనే విష‌యంలో అధికారికంగా ఏ ప్ర‌క‌ట‌నా లేక‌పోవ‌డంతో అభిమానులు ఉత్కంఠ‌కు గుర‌వుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English