పవన్‌కళ్యాణ్‌ రావాలని బలంగా కోరుకోండి

పవన్‌కళ్యాణ్‌ రావాలని బలంగా కోరుకోండి

పవన్‌కళ్యాణ్‌ తిరిగి సినిమాలు స్టార్ట్‌ చేస్తాడనే టాక్‌ బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో 'వాల్మీకి' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హరీష్‌ శంకర్‌ స్పీచ్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పవన్‌కళ్యాణ్‌ని తాను కలిసినట్టుగా, ఆయన తన 'వాల్మీకి' ట్రెయిలర్‌ని మెచ్చుకున్నట్టుగా హరీష్‌ చెప్పాడు.

అయితే సినిమాల గురించి తప్ప అన్నిటి గురించి డిస్కషన్‌ జరిగిందంటూ మీడియా తన మీట్‌ గురించి ఎక్కువ విశేషాలు తెలుసుకోకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే గబ్బర్‌సింగ్‌ తర్వాత ఇన్నేళ్లలో ఇప్పుడే హరీష్‌ని కలవడం మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంటే. మైత్రి మూవీ మేకర్స్‌ వారు హరీష్‌ శంకర్‌తో పవన్‌కి ఒక కథ చెప్పించారని బలంగా వినిపిస్తోంది.

అయితే పవన్‌ ఇక సినిమాలు చేయరని అనకుండా, మీరు తలచుకుంటే ఆయన తప్పకుండా వస్తారనే అర్థం వచ్చేలా అభిమానులని అది గట్టిగా కోరుకోవాలని కోరాడు. గబ్బర్‌సింగ్‌ చిత్రానికి ఎలాగయితే పవన్‌కి హిట్‌ రావాలని కోరుకున్నారో అలాగే ఆయన మళ్లీ రావాలని కూడా కోరుకోవాలని, అది జరుగుతుందని అన్నాడు.

దీనిని బట్టి పవన్‌ తిరిగి రావడానికి ఆలోచన అయితే మొదలయిందనేది అర్థమవుతోంది. వచ్చే రెండు, మూడు నెలల్లో రాజకీయ పరంగా పవన్‌ ఉనికి తెలిపే ఎలాంటి సందర్భం రానట్టయితే ఒక రెండు చిత్రాలకి అయినా పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుందనే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English