'సైరా'కి అవెందుకు తొక్కి పెడుతున్నారు?

'సైరా'కి అవెందుకు తొక్కి పెడుతున్నారు?

'సైరా' ట్రెయిలర్‌ రెండు రోజుల్లో విడుదల కానుందనే ఆనందంతో అభిమానులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. అయితే సినిమా విడుదలకి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి వుండగా ఇంతవరకు ఒక్క పాట కూడా విడుదల చేయకపోవడం పట్ల మాత్రం పలువురు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అన్ని భాషలలోను పాటలని ఇంకా రికార్డు చేయకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. ప్రతి సింగిల్‌ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేయాల్సి వుంటుంది కనుక ఆ వర్క్‌ డిలే అవుతోందట. అందుకే ట్రెయిలర్‌ని ఎర్లీగా విడుదల చేసి, సినిమా విడుదలకి ఇంకా పది రోజులు వుందనగా, ఎక్కువ గ్యాప్‌ లేకుండా ఒక్కో పాట విడుదల చేస్తారట.

సాధారణంగా చిరంజీవి సినిమా పాటలంటే హుషారుగా వుంటాయి కనుక ఫాన్స్‌ ఎక్కువ అంచనా వేస్తుంటారు. కానీ సైరా నరసింహారెడ్డిలో అన్నీ సిట్యువేషనల్‌ సాంగ్సే వుంటాయట. అందుకే ఆడియో పరంగా ఎక్కువ స్ట్రెస్‌ చేయకుండా లో ప్రొఫైల్‌లో వుంచినట్టు సమాచారం.

ఈ చిత్రం హిందీ హక్కులు సొంతం చేసుకున్న ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ హిందీ మార్కెట్లలో 'సైరా'కి తగినంత ఆదరణ లభించేటట్టుగా సకల సన్నాహాలు చేసుకుంటోంది. ఎల్లుండి జరిగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పవన్‌కళ్యాణ్‌, రాజమౌళి ముఖ్య అతిథులుగా రానున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English