పవన్ కళ్యాణ్‌ను హరీష్ శంకర్ కలిసి..

పవన్ కళ్యాణ్‌ను హరీష్ శంకర్ కలిసి..

సినిమా వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ సెలబ్రెటీ మాట్లాడినా సరే.. ఆడిటోరియాలు హోరెత్తిపోతుంటాయి. మెగా హీరోలతో సంబంధం లేని వేడుకలైనా సరే.. పవన్ పేరెత్తగానే ఒక్కసారిగా కేరింతలు వినిపిస్తాయి. ఇక మెగా హీరోల వేడుకల గురించైతే చెప్పాల్సిన పని లేదు. ఈవెంట్ మొదలైనప్పటి నుంచి పవన్నామస్మరణలతో ఆడిటోరియాలు దద్దరిల్లుతుంటాయి. ఏ అతిథి వేదిక మీదికి వచ్చినా పవర్ స్టార్ నినాదాలు హోరెత్తుతుంటాయి.

ఇక పవన్‌తో అనుబంధం ఉన్నవాళ్లు వేదిక మీదికి వస్తే ఇక పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. ‘వాల్మీకి’ ఈవెంట్లో ఇదే పరిస్థితి ఎదురైంది. పవన్‌తో ‘గబ్బర్ సింగ్’ లాంటి మెమొరబుల్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ వేదిక మీద ఉంటే ఏం జరిగి ఉంటుందో అంచనా వేయొచ్చు. పవన్ నినాదాలతో అభిమానులు గోల గోల చేసేశారు.

తాను వారం కిందటే పవన్ కళ్యాణ్‌ను కలిశానంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు హరీష్. కానీ ఆ విషయం గురించి తర్వాత మాట్లాడతానంటూ పావు గంటకు పైగా వాళ్లను నిరీక్షింపజేసి చివరికి అసలు విషయం చెప్పాడు. ఇటీవల పవన్‌ను కలిస్తే ‘వాల్మీకి’ ట్రైలర్ చాలా బాగుందని మెచ్చుకున్నాడని హరీష్ చెప్పాడు. ఐతే తమ మధ్య సాగిన పది నిమిషాల సంభాషణలో సినిమా గురించి తప్ప మిగతా అన్ని విషయాలూ మాట్లాడుకున్నామన్నాడు హరీష్. అందులో ఐదు నిమిషాలు తన క్షేమ సమాచారాన్ని కనుక్కోవడానికే పవన్ వెచ్చించాడన్నాడు. ఒక అన్నయ్య లాగా తనకు హితవు చెప్పాడని.. తర్వాత వేరే విషయాలు మాట్లాడుకున్నామని చెప్పాడు హరీష్.

ఇక పవన్‌తో తన సినిమా ఎప్పుడు అని అడుగుతున్నారని.. ఇలా అడిగి లాభం లేదని.. నిజంగా తమ కలయికలో సినిమా  కావాలంటే అభిమానులు అందుకోసం గట్టిగా కోరుకోవాలని.. ‘గబ్బర్ సింగ్’ టైంలో ఇలా కోరుకున్నారు కాబట్టే అది కార్యరూపం దాల్చిందని.. అలాగే ఇప్పుడు కూడా సంకల్పంతో అనుకుంటే సాధ్యచం అవుతుందని అని ముగించాడు హరీష్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English