సైరాలో బాహుబ‌లి క‌న్నా ఎక్కువే..

సైరాలో బాహుబ‌లి క‌న్నా ఎక్కువే..

విజువ‌ల్ ఎఫెక్ట్స్.. ఈ మాట‌ను ఇప్పుడు సామాన్య ప్రేక్ష‌కులు కూడా విరివిగా వాడేస్తున్నారు. మ‌న సినిమాల్లో వీటికి ప్రాధాన్యం అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఈ విష‌యంలో మ‌న డైరెక్ట‌ర్లు, టెక్నీషియ‌న్ల నుంచి బాలీవుడ్ స‌హా వేరే ఇండ‌స్ట్రీల వాళ్లు పాఠాలు నేర్చుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది.

రాజ‌మౌళి ఈ విష‌యంలో మిగ‌తా డైరెక్ట‌ర్ల‌కు స్ఫూర్తిగా నిలిచాడు. శ్ర‌ద్ధ పెడితే హాలీవుడ్ సినిమాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని స్థాయిలో మ‌న‌వాళ్లు ఔట్ పుట్ తేగ‌ల‌ర‌ని రుజువు చేశాడు. కాబ‌ట్టే ఇప్పుడు సురేంద‌ర్ రెడ్డి లాంటి మామూలు డైరెక్ట‌ర్ కూడా భారీగా విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ముడిప‌డ్డ సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

విశేషం ఏంటంటే.. వీఎఫెక్స్ విష‌యంలో ఒక రోల్ మోడ‌ల్‌గా నిలిచిన బాహుబ‌లిలో కంటే సైరాలో ఎక్కువ వీఎఫెక్స్ వ‌ర్క్ ఉంద‌ట‌. ఏకంగా 3500 వీఎఫెక్స్ షాట్లు ఉన్న‌ట్లు తెలిసింది. బాహుబ‌లిలో కంటే ఇవి వెయ్యి ఎక్కువ కావ‌డం విశేషం. ఐతే పెట్టిన ఖ‌ర్చు మాత్రం త‌క్కువేన‌ట‌. సైరా వీఎఫెక్స్ బ‌డ్జెట్ రూ.45 కోట్లేన‌ట‌. బాహుబ‌లి కోసం దీనికి రెట్టింపు స్థాయిలో ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం.

ఇక 2.0లో వీఎఫెక్స్ కోసం శంక‌ర్ అయితే వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేయించాడు. తీరా చూస్తే అవి అంత విశేషంగా ఏమీ అనిపించ‌లేదు. మ‌రి సైరాలో ప‌రిమిత బ‌డ్జెట్లో అన్ని వీఎఫెక్స్ షాట్ల‌ను ఎంత ఎఫెక్టివ్‌గా తీర్చిదిద్దారో చూడాలి. చెన్నై స‌హా అనేక న‌గ‌రాల్లో కొన్ని రోజులుగా రేయింబ‌వ‌ళ్లు ఈ వ‌ర్క్ న‌డుస్తోంది. ఇప్పుడ‌ది ముగింపు ద‌శ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English