వాల్మీకిలో ఈ పాట క‌నువిందేగా..

వాల్మీకిలో ఈ పాట క‌నువిందేగా..

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కెరీర్‌కు చాలా కీల‌క‌మైన సినిమా వాల్మీకి. అత‌డి గ‌త సినిమా దువ్వాడ జ‌గ‌న్నాథం ఫ్లాప్ కావ‌డంతో మ‌రో సినిమా ద‌క్కించుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. పైగా త‌న రేంజికి త‌గ్గ స్టార్ హీరో కూడా దొర‌క‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మిళ హిట్ జిగ‌ర్ తండ‌ను రీమేక్ చేయ‌డానికి రెడీ అయ్యాడు. వ‌రుణ్‌ను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌కు ఎంచుకున్నాడు.

ఐతే తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి ఈ సినిమా స‌రిపోతుందా.. వ‌రుణ్‌ను నెగెటివ్ రోల్‌లో ప్రేక్ష‌కులు ఆమోదిస్తారా అన్న సందేహాలు నెల‌కొన్నాయి. కానీ ఈ పాత్ర‌ను త‌మిళం నుంచి ఉన్న‌దున్న‌ట్లుగా దించేయ‌కుండా త‌న‌దైన ట‌చ్ ఇచ్చిన‌ట్లున్నాడు హ‌రీష్‌.

వ‌రుణ్ చేసిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ పాత్ర‌కు ఎంచుకున్న గెట‌ప్‌, మేన‌రిజ‌మ్స్, డైలాగ్స్ అన్నీ కూడా ప్ర‌త్యేకంగానే క‌నిపిస్తున్నాయి. దీనికి తోడు త‌మిళంలో మాదిరి కాకుండా హీరో-విల‌న్‌కు మ‌ధ్య‌లో ఆ పాత్ర‌ను మ‌లిచి దానికో ఫ్లాష్ బ్యాక్ ల‌వ్ స్టోరీ కూడా యాడ్ చేశాడు. ఈ ఫ్లాష్ బ్యాకే సినిమాలో హైలైట్‌గా ఉంటుంద‌ని అంతా అంటున్నారు. దీన్ని జ‌న‌రంజ‌కంగా తీర్చిదిద్ద‌డానికి ఏం చేయాలో అన్నీ చేసిన‌ట్లే ఉన్నాడు పూజా హెగ్డే లాంటి క్రేజీ హీరోయిన్ని ఫ్లాష్ బ్యాక్ కోసం తీసుకోవ‌డ‌మే కాదు.. ఆమె గ్లామ‌ర్‌ను సినిమా కోసం బాగానే వాడుకున్న‌ట్లున్నాడు.

వ‌రుణ్‌-పూజా మీద అత‌ను వెల్లువొచ్చి గోదార‌మ్మ పాట రీమిక్స్ పాట‌ను చిత్రీక‌రించిన సంగ‌తి తెలిసిందే. దీని మేకింగ్ వీడియో ఇప్పుడు రిలీజ్ చేశారు. ఒరిజిన‌ల్ సాంగ్ త‌ర‌హాలోనే గోదారి అందాల మ‌ధ్య బిందెల సెట్టింగ్‌లో సినిమా తీయ‌డం విశేషం. పూజా కూడా భ‌లే అందంగా ఉంది. వ‌రుణ్ శోభ‌న్ బాబును గుర్తు చేసే స్టెప్స్ వేశాడు. మొత్తానికి ఈ పాట థియేట‌ర్ల‌ను హోరెత్తించేసేలాగే క‌నిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English