డైరెక్ష‌న్ చేస్తానంటే రామ్ చ‌ర‌ణ్ ఆపేశాడ‌ట‌

డైరెక్ష‌న్ చేస్తానంటే రామ్ చ‌ర‌ణ్ ఆపేశాడ‌ట‌

సినీ రంగంలో ఏ టెక్నిక‌ల్‌ విభాగంలో ప‌ని చేసిన వాడికైనా.. అంతిమంగా ద‌ర్శ‌కుడు కావ‌డం ల‌క్ష్యంగా ఉంటుంది. సినిమాల మేకింగ్‌లో అత్యంత కీల‌క పాత్ర పోషించే కెమెరామెన్స్ చాలామంది మెగా ఫోన్ ప‌ట్టిన వాళ్లే. రాజీవ్ మీన‌న్‌, పీసీ శ్రీరామ్ లాంటి లెజెండ్స్ ద‌గ్గ‌ర్నుంచి ద‌ర్శ‌కులుగా మారిన సినిమాటోగ్రాఫ‌ర్ల‌ను చాలామందిని చూశాం.

ప్ర‌స్తుతం సౌత్ సినిమాల్లో టాప్ సినిమాటోగ్రాఫ‌ర్ల‌లో ఒక‌డిగా ఉన్న ర‌త్న‌వేలుకు సైతం ద‌ర్శ‌క‌త్వ క‌ల ఉంద‌ట‌. ఇందుకు ఎన్నో ఏళ్ల ముందే స‌న్నాహాలు కూడా మొద‌ల‌య్యాయి. ఏడేళ్ల కింద‌టే అత‌ను ద‌ర్శ‌కుడిగా మారాల్సింద‌ట‌. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల త‌న క‌ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంద‌ని.. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడిగా మారుతాన‌ని అంటున్నాడు.

ఏడేళ్ల ముందు ద‌ర్శ‌క‌త్వానికి రంగం సిద్ధం చేసుకున్న స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పిలిచి రోబో సినిమా చేయ‌మ‌న్నార‌ని.. అంత పెద్ద అవ‌కాశం వ‌చ్చే స‌రికి త‌న డైర‌క్టోరియ‌ల్ ప్రాజెక్టును వాయిదా వేసుకున్నాన‌ని.. ఆపై రంగ‌స్థ‌లం సినిమా త‌ర్వాత క‌చ్చితంగా ద‌ర్శ‌క‌త్వం చేయాల్సిందే అని ఫిక్స‌య్యాన‌ని.. కానీ త‌న‌ను రామ్ చ‌ర‌ణ్ ఆపాడ‌ని ర‌త్న‌వేలు తెలిపాడు.

సినిమాటోగ్రాఫ‌ర్‌గా టాప్‌లో ఉన్న‌పుడు.. ఇండ‌స్ట్రీకి త‌న అవ‌స‌రం చాలా ఉన్న‌పుడు ద‌ర్శ‌క‌త్వం చేయొద్ద‌ని చెప్పాడ‌ని.. పైగా సైరా న‌ర‌సింహారెడ్డి లాంటి మెగా ప్రాజెక్టు మందుకు రావ‌డంతో ఆగాన‌ని ర‌త్న‌వేలు చెప్పాడు. ప్ర‌స్తుతం స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రానికి ప‌ని చేస్తున్నాన‌ని.. దీని త‌ర్వాత భార‌తీయుడు-2 చేయాల్సి ఉంద‌ని.. ఆ త‌ర్వాత అయినా ద‌ర్శ‌కుడిగా సినిమా మొద‌లుపెట్టాల‌నుకుంటున్నాన‌ని.. దానికి క‌థ కూడా రెడీ అయింద‌ని చెప్పాడు ర‌త్న‌వేలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English