బాహుబలి మార్కెట్‌ని మేసేస్తున్నారు

బాహుబలి మార్కెట్‌ని మేసేస్తున్నారు

బాహుబలితో నార్త్‌ ఇండియాలో దక్షిణాది చిత్రాలకి మార్కెట్‌ ఏర్పడింది. అంతకుముందు దక్షిణాది చిత్రాలని చిన్న చూపు చూస్తూ అనువదించాలని అనుకున్న చిత్రాలకి దారుణమయిన రేట్లు ఆఫర్‌ చేసేవారు. కావాలంటే రీమేక్‌ హక్కులు అమ్మేయాలని డిమాండ్‌ చేసేవారు. కానీ బాహుబలి ఆ పరిస్థితి మార్చింది. కెజిఎఫ్‌ కూడా సౌత్‌ సినిమాల పట్ల నార్త్‌ ఆడియన్స్‌ ఆసక్తిని పెంచింది. అయితే నార్త్‌లో ఏర్పడిన క్రేజ్‌ని హరించేయాలని చూస్తున్నారు కొందరు. సాధారణ మాస్‌ సినిమాలు తీసేసి జాతీయ వ్యాప్తంగా నచ్చే అంశాలున్నాయంటూ వివిధ భాషలలో విడుదల చేస్తున్నారు.

ఈ వారాంతంలో వచ్చిన పహిల్వాన్‌ అలాంటి చిత్రమే. ఏదో కుస్తీ ఆట మీద బయోపిక్‌ అన్నట్టుగా ఈ చిత్రాన్ని ప్రొజెక్ట్‌ చేస్తూ వచ్చారు. తీరా చూస్తే సగటు కన్నడ మాస్‌ సినిమాలో కుస్తీ నేపథ్యాన్ని మాత్రం పెట్టుకున్నారు. దీనిని పాన్‌ ఇండియా సినిమా అంటూ హడావిడి చేసారు. ఈ చిత్రానికి కన్నడలో తప్ప ఇంకెక్కడా కనీస వసూళ్లు రాలేదు కానీ మిగతా భాషలలో చూసిన ఆ కొందరు కూడా మోసపోయినట్టే భావిస్తారు. చూస్తూ, చూస్తూ వున్న మార్కెట్‌ని హరించుకునే ఇలాంటి ప్రయత్నాలు దేనికి? కొద్ది రోజుల క్రితమే 'కురుక్షేత్రం' అంటూ ఒక నాసి రకం సినిమాని దేశం మీదకి వదిలారు కన్నడ సినిమా మేకర్స్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English