ఒక్క సినిమాతో బతికేస్తున్నాడు!

ఒక్క సినిమాతో బతికేస్తున్నాడు!

టెలివిజన్‌ రంగంలో రియాలిటీ, గేమ్‌ షోలతో తనదైన ముద్ర వేసిన ఓంకార్‌ దర్శకుడిగా తొలి చిత్రంతోనే 'జీనియస్‌' అనిపించుకోవాలని చూసాడు. బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకి కథలు అందించిన చిన్నికృష్ణ రాసిన ఆ కథ డిజాస్టర్‌ అయింది. తొలి ప్రయత్నంలో దర్శకుడిగా దెబ్బ తిన్న ఓంకార్‌ ట్రెండ్‌ ఫాలో అయి 'రాజుగారి గది' అనే హారర్‌ కామెడీ తీసాడు. అది మాస్‌ని ఆకట్టుకోవడంతో రెండోసారి పెద్ద స్టార్‌ కాస్ట్‌ని పెట్టుకుని, నాగార్జున, సమంత కీలక పాత్రల్లో 'రాజుగారి గది 2' తీసాడు. అది అంతంతమాత్రంగానే ఆడింది. అయితే మరోసారి 'రాజుగారి గది 3' అంటూ ఇంకో చిత్రాన్ని తీసుకొస్తున్నాడు.

'కాంచన' సిరీస్‌తో లారెన్స్‌ ఎలాగయితే హారర్‌ కామెడీనే నమ్ముకుంటున్నాడో ఓంకార్‌ కూడా 'రాజుగాది గది' వదలడం లేదని, ఈ రాజుగారికి ఎన్ని గదులున్నాయని సోషల్‌ మీడియాలో జోక్స్‌ వేస్తున్నారు. లారెన్స్‌ మాదిరిగా అన్ని రకాల సినిమాలు తీస్తూ మధ్యలో ఒకసారి ఇలా హారర్‌ కామెడీ చేస్తే బాగుంటుంది కానీ ఇలా ఒకే సినిమాపై బతికేయాలని చూడడమేంటని కామెంట్‌ చేస్తున్నారు. హారర్‌ కామెడీలకి కాలం చెల్లిపోయింది కానీ లారెన్స్‌ 'కాంచన' అయితే ఇప్పటికీ మాస్‌ ప్రేక్షకులని థియేటర్లకి రప్పిస్తోంది. మరి ఓంకార్‌ 'గది'కి కూడా మళ్లీ మళ్లీ ప్రేక్షకులని థియేటర్లకి రప్పించే సత్తా వుందా లేదా అనేది చూడాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English