అల వైకుంఠపురములో అదరగొట్టేస్తున్నాడట!

అల వైకుంఠపురములో అదరగొట్టేస్తున్నాడట!

'అల వైకుంఠపురములో' చిత్రం గురించి ఇండస్ట్రీలో చాలా పాజిటివ్‌ బజ్‌ వినిపిస్తోంది. చిన్నప్పుడే తండ్రికి దూరమైన కొడుకు పాతికేళ్ల వయసులో తన తండ్రి ఎవరనేది తెలుసుకుని, అదే ఇంటికి పనివాడిగా వచ్చి ఆ తండ్రి కష్టాలన్నీ తీర్చి, కొడుకుగా తన బాధ్యతలు నిర్వర్తించడం సింపుల్‌గా ఈ సినిమా స్టోరీ అని టాక్‌.

త్రివిక్రమ్‌ ఈ చిత్రంలో తన మార్కు హాస్యం, భావోద్వేగాలు బాగా పండిస్తున్నాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రానికి తమన్‌ అందిస్తున్న స్వరాలు చాలా బాగున్నాయని తెలిసింది. అరవింద సమేత చిత్రానికి తన శైలికి భిన్నమైన పాటలు అందించిన తమన్‌ తనకి అల్లు అర్జున్‌తో వున్న ట్రాక్‌ రికార్డ్‌ని మరింత నిలబెట్టే పాటలని ఇందులో అందిస్తున్నాడట.

తమన్‌ మ్యూజిక్‌ ఈ చిత్రానికి మెయిన్‌ హైలైట్‌ అవుతుందని, సంక్రాంతికి వచ్చే చిత్రాలలో 'సరిలేరు నీకెవ్వరు'కి ఆడియో పరంగా ఈ చిత్రం పెద్ద ఛాలెంజే విసరనుందనేది ఇండస్ట్రీ మాట. దసరాకి విడుదల చేసే టీజర్‌తో ఈ చిత్రం క్రేజ్‌ మరో లెవల్‌కి చేరుతుందని, డైలాగ్‌ రైటర్‌గా త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి మరో సారి కదం తొక్కుతున్నాడని ఇన్‌సైడర్స్‌ టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English