నాని అక్కడ దుమ్ము దులుపుతున్నాడు

నాని అక్కడ దుమ్ము దులుపుతున్నాడు

నేచురల్ స్టార్ నాని మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన దమ్ము చూపిస్తున్నాడు. ఈ శుక్రవారం రిలీజైన అతడి కొత్త సినిమా ‘గ్యాంగ్ లీడర్’ డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టడం విశేషం. రెండు రోజుల షేర్ రూ.10 కోట్ల మార్కును టచ్ చేసింది. మూడో రోజు కూడా సినిమా ఇదే స్థాయిలో వసూళ్లు రాబట్టే అవకాశముంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా స్టడీగా సాగిపోతుండగా.. యుఎస్‌లో అంచనాల్ని మించి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం శనివారం నాటికే హాఫ్ మిలియన్ మార్కును దాటేయడం విశేషం. వారాంతం అయ్యేసరికి హాఫ్ మిలియన్ అంటూ ట్రేడ్ పండిట్లు అంచనాా వేయగా.. శనివారానికే 5.7 లక్షల డాలర్లకు ‘గ్యాంగ్ లీడర్’ వసూళ్లు చేరుకున్నాయి.

ప్రిమియర్లు, శుక్రవారం వసూళ్లు కలిపితే 3.5 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘గ్యాంగ్ లీడర్’.. శనివారం మరింత ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. ఒక్క రోజులో 2.25 లక్షల డాలర్లు వచ్చాయి. దీంతో అలవోకగా హాఫ్ మిలియన్ మార్కును దాటేసింది. ఆదివారం షోలు అయ్యేసరికి సినిమా 7 లక్షల డాలర్ల మార్కును దాటేయడం ఖాయం. రెండో వీకెండ్ వరకు సినిమా హోల్డ్ చేయగలిగితే మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరే అవకాశాలు కూడా ఉన్నాయి.

మామూలుగా అమెరికాలో రివ్యూల్ని బట్టే వసూళ్లు ఉంటాయి. అక్కడి జనాలు సమీక్షల్ని బాగా ఫాలో అవుతారు. ‘గ్యాంగ్ లీడర్’కు మోడరేట్ రివ్యూలు వచ్చిన నేపథ్యంలో సినిమా అసలు నిలబడుతుందా అన్న సందేహాలు కలిగాయి. కానీ ఈ చిత్రం ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ ఇప్పటికే బయ్యర్‌ పెట్టుబడిని దాదాపుగా వెనక్కి తెచ్చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English