బరువు తగ్గడం కోసం హిమాలయాలకు హీరోయిన్

 బరువు తగ్గడం కోసం హిమాలయాలకు హీరోయిన్

హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉన్నా పర్వాలేదని సర్దుకుపోయే రోజులు కావివి. హీరోయిన్‌కు నాజూగ్గా ఉండటం అన్నది కచ్చితంగా ఉండాల్సిన క్వాలిటీ అయిపోయింది. ఏ హీరోయిన్ అయినా కాస్త లావుగా ఉంటే కామెంట్లు పడిపోతాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ సంగతి చెప్పాల్సిన పని లేదు. అందుకే ప్రతి హరోయిన్ జీరో సైజ్ కాకపోయినా.. సాధ్యమైనంత సన్నగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.

ఐతే ఢిల్లీ భామ రాశి ఖన్నా మాత్రం కెరీర్ ఆరంభంలో బొద్దుగా కనిపించేది. ‘ఊహలు గుసగుసలాడే’ మొదలుకుని.. ‘జిల్’ వరకు ఆమె అదే రూపాన్ని మెయింటైన్ చేసింది. కానీ కొన్నేళ్లకు ఉన్నట్లుండి బరువు తగ్గింది. రెండు మూడేళ్లుగా నాజూగ్గా కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.

ఐతే తాను బరువు అంత తేలిగ్గా తగ్గిపోలేదని చెబుతోంది రాశి. సన్నబడటం కోసం తాను హిమాలయాల వరకు వెళ్లినట్లు ఆమె వెల్లడించడం విశేషం. తన బొద్దుతనం గురించి రకరకాల కామెంట్లు రావడంతో ఎన్నో రకాల డైటింగ్‌లు చేశానని.. ఏడాది పాటు కేవలం పండ్లు, కూరగాయలు, ఉడికించిన చేపలు తిన్నానని.. కానీ ఫలితం లేకపోయిందని.. పైగా హార్మోనల్ సమస్యలు వచ్చాయని రాశి చెప్పింది.

బరువు తగ్గకపోగా పెరగడం కూడా జరిగిందని.. ఇంత చేస్తున్నా బరువెందుకు తగ్గడం లేదని చాలా బాధ పడిపోయానని.. ఆ సమయంలో ఒక ఫ్రెండ్ హిమాలయాలకు వెళ్లమని సలహా ఇచ్చిందని.. అక్కడి ఆనందాశ్రమానికి వెళ్తే.. తన బాడీది ‘కఫ’ తత్వం అని.. ఏం తినాలో ఏం తినకూడదో చెప్పారని.. అలాగే ఏదీ రాత్రికి రాత్రి జరిగిపోదని హితవు చెప్పారని.. అక్కడి నుంచి తిరిగి వచ్చాక కుల్‌దీప్ అనే ట్రైనర్ పరిచయం అయ్యాడని.. అతడి సహకారంతో బరువు తగ్గే ట్రైనింగ్, డైట్ మీద దృష్టిపెడితే నెమ్మదిగా బరువు తగ్గడం మొదలైందని చెప్పింది రాశి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English