డివైడ్ టాక్‌.. అయినా హౌస్ ఫుల్సే

డివైడ్ టాక్‌.. అయినా హౌస్ ఫుల్సే

నేచుర‌ల్ స్టార్ నాని కొత్త సినిమా గ్యాంగ్ లీడ‌ర్ ట్రేడ్ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట పాజిటివ్ బ‌జ్ ఉన్నా.. బుకింగ్స్ సాధార‌ణంగా క‌నిపించాయి. కానీ రిలీజ్ రోజు డివైడ్ టాక్ వ‌చ్చినా వ‌సూళ్ల‌కు ఢోకా లేదు. తొలి రోజు ఉద‌యం, మ‌ధ్యాహ్నం షోల‌కు ఆక్యుపెన్సీ ఓ మోస్త‌రుగా క‌నిపించ‌గా.. సాయంత్రం నుంచి సినిమా పిక‌ప్ అయింది. హౌస్ ఫుల్స్ ప‌డ్డాయి.

శ‌నివారం ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న క‌నిపిస్తోంది. చాన్నాళ్ల త‌ర్వాత ఫ్యామిలీస్ చూసే సినిమాలా క‌నిపించ‌డంతో ఈ రోజు థియేట‌ర్లు కిట‌కిట‌లాడిపోయాయి. ఫ‌స్ట్ షో, సెకండ్ షోల‌కు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు ప‌డిపోయాయి.

బుక్ మై షోలో చాలా షోలు సోల్డ్ ఔట్ అయిపోగా.. మిగ‌తావి ఆల్మోస్ట్ ఫుల్ స్టేట‌స్‌లో క‌నిపించాయి. ఆదివారం కూడా గ్యాంగ్ లీడ‌ర్‌కు ఢోకా లేన‌ట్లే ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. మొత్తానికి మూడు రోజుల తొలి వీకెండ్లో గ్యాంగ్ లీడ‌ర్ మంచి షేరే రాబ‌ట్టేలా ఉంది. వ‌ర‌ల్డ్ వైడ్ రూ.15 కోట్ల‌కు త‌క్కువ కాకుండా షేర్ గిట్టుబాటు కావ‌చ్చు. కానీ ఆ త‌ర్వాత సినిమా ఏమాత్రం నిల‌బ‌డుతుంది.. ఎంత షేర్ రాబ‌డుతుంది అన్న‌ది కీల‌కం.

సోమ‌వారం వ‌సూళ్ల‌లో మేజ‌ర్ డ్రాప్ లేకుంటే సినిమా బ్రేక్ ఈవెన్ దిశ‌గా అడుగులేసిన‌ట్లే. ఈ చిత్రం రూ.28 కోట్ల షేర్ రాబ‌డితే బ‌య్య‌ర్లు సేఫ్ జోన్లోకి వ‌స్తారు. అమెరికాలో ఈ చిత్రం హాఫ్ మిలియ‌న్ మార్కు దిశ‌గా అడుగులు వేస్తోంది. వీకెండ్ అయ్యేలోపు ఆ మార్కును ఈజీగానే అందుకునేలా ఉంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English