దాగుడుమూత‌లు ఆడాల‌నుకున్నాడ‌ట కానీ..

దాగుడుమూత‌లు ఆడాల‌నుకున్నాడ‌ట కానీ..

దువ్వాడ జ‌గ‌న్నాథం రిలీజ్ టైంలో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాను ఒక బ్లాక్ బ‌స్ట‌ర్‌గా ప్ర‌చారం చేసుకున్నాడ‌త‌ను. స‌క్సెస్ మీట్లో మాట్లాడుతూ.. సినిమా గురించి నెగెటివ్‌గా మాట్లాడిన వాళ్ల‌ను, రివ్యూలు ఇచ్చిన వాళ్ల మీద విరుచుకుప‌డ్డాడు.

డీజే సూప‌ర్ హిట్ అని ఒప్పించ‌డానికి ఎంత‌గానో ప్ర‌య‌త్నించాడు. కానీ ఫ‌లితం లేక‌పోయింది. ఓపెనింగ్స్ వ‌ర‌కు మెరుపులు మెరిపించి.. ఆ త‌ర్వాత చ‌ల్ల‌బ‌డిపోయింది డీజే. ఈ సినిమా ఫ్లాప్ అనే విష‌యం స్వ‌యంగా దిల్ రాజే ఆ త‌ర్వాత ఒప్పుకున్నాడు. హ‌రీష్ శంక‌ర్‌కు రాజు మ‌రో అవ‌కాశం ఇచ్చిన‌ట్లే ఇచ్చి వెన‌క్కి త‌గ్గ‌డాన్ని బ‌ట్టి డీజే ఫ‌లితంపై ఆయ‌న అసంతృప్తి అంద‌రికీ అర్థ‌మైంది.

రాజుతో హ‌రీష్ అనుకున్న దాగుడు మూత‌లు సినిమా చ‌ర్చ‌ల్లోంచి వెళ్లిపోయాక వాల్మీకి తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి మ‌ధ్య‌లో ఏం జ‌రిగిందో ఇప్పుడు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు హ‌రీష్‌. దాగుడు మూత‌లు పేరుతో తాను ఓ క‌థ రాసుకున్న మాట వాస్త‌వ‌మ‌ని.. దాన్ని ఇద్ద‌రు హీరోల‌తో చేయాల‌నుకున్నాన‌ని.. కానీ తాను అనుకున్న హీరోలు దొర‌క‌లేద‌ని.. అందుకే ఈ సినిమా ఆగిపోయింద‌ని చెప్పాడు హ‌రీష్‌.

ఐతే నిజంగా హీరోలు దొర‌క్క‌నే సినిమా ఆగిపోయిందా.. లేక హ‌రీష్ మీద న‌మ్మ‌కం కుద‌ర‌క రాజు ఈ ప్రాజెక్టు ఆపేశాడా అన్న‌ది సందేహం. ఎందుకంటే రాజు త‌లుచుకుంటే హీరోల్ని ఒప్పించ‌లేడా? ఆయ‌న ఉద్దేశ‌పూర్వ‌కంగానే హ‌రీష్‌ను త‌న క్యాంప్‌కు దూరంగా పెట్టాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English