శృతివలన ఫోకస్‌ దెబ్బతింటోంది

శృతివలన ఫోకస్‌ దెబ్బతింటోంది

అసలు ఆ సినిమా కాన్సెప్ట్‌ వేరు. కాని ఇక్కడ జరుగుతున్న ప్రచారం వేరు. కారణం ఏదైనా దర్శకుడు మాత్రం బాగా ఫీలవుతున్నాడు. ఓ అద్భుతమైన కథతో సినిమా తీస్తే..తనకి, తన సినిమాకి ప్రచారం రావాల్సింది పోయి..ఆ కథలో భాగంగా వచ్చే ఓ వేశ్య పాత్రకి ఎక్కువ ప్రచారం వచ్చేసిందని నెత్తినోరు కొట్టుకుంటున్నాడు. ఇదంతా  బాలీవుడ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌ ‘డి డే’ గురించే. పాకిస్థానీ తీవ్రవాదుల్ని పాక్‌లోనే అంతమొందించే భారతీయ స్లీపర్స్‌సెల్స్‌ కథ ఇది. ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ వేశ్యగా రెండు నిమిషాల పాటు కనిపించే పాత్రలో నటించింది.

అయితే మీడియా పుణ్యమా అని ఆ క్యారెక్టర్‌కి ఇప్పుడు పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. శ్రుతి వేశ్యగా హాట్‌ హాట్‌గా దర్శనమీయనుందని, అందాల ఆరబోతతో కురర్రకారుకు పిచ్చెక్కించనుందని మీడియా ప్రచారం చేసేసింది. పైగా ఇప్పుడు ఆమె మొహం మీద మచ్చ...గురించీ లేనిపోని పబ్లిసిటీ. దీంతో రావాల్సిన యాంగిల్‌లో పేరు రాకుండా..ఓ చిన్న కేరెక్టర్‌కి అంత పేరొచ్చేస్తోంటే బెంబేలెత్తిపోతున్నారు దర్శకనిర్మాతలు. కనీసం రిలీజ్‌ అయ్యాక అయినా..ప్లేటు మారి తమకి పేరొస్తుందని ఎదురుచూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు