సైరా టీంకు కేటీఆర్‌ ఝలక్.. ఏంటి సంగతి?

సైరా టీంకు కేటీఆర్‌ ఝలక్.. ఏంటి సంగతి?

కర్నూలులో ఈ నెల 15కు అనుకున్న ‘సైరా నరసింహారెడ్డి’ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంకి మారుస్తున్నట్లు, 18న వేడుక నిర్వహించనున్నట్లు గురువారం సాయంత్రమే చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఈ వేడుకకు హాజరయ్యే అతిథుల వివరాలు కూడా ప్రకటించారు.

పవన్ కళ్యాణ్, వి.వి.వినాయక్‌లతో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఈ వేడుకలో పాల్గొంటారని పేర్కొన్నారు. కానీ ఈ ప్రకటన చేసిన రెండు గంటల తర్వాత మరో ట్వీట్లో కేటీఆర్ ఈ వేడుకకు హాజరు కారని వెల్లడించారు. ఆయనకు వేరే కమిట్మెంట్లు ఉండటం వల్ల ఈ వేడుకలో పాల్గొనలేకపోతున్నట్లు తెలిపారు.

ఐతే ముందు ఈ ప్రకటన చేసే సమయానికి కేటీఆర్ కమిట్మెంట్ల గురించి తెలియదా? అసలు ఆయనతో మాట్లాడే చిత్ర బృందం ఆయన పేరును అతిథుల జాబితాలో చేర్చిందా? ఇంతలో ఈ మార్పు ఎందుకు జరిగింది..? అనే సందేహాలు జనాల్లో మొదలయ్యాయి. మరీ కేటీఆర్‌ను అడక్కుండా అయితే ఆయన్ని అతిథిగా పేర్కొనే సాహసం చేసి ఉంటారా అంటే డౌటే.

మరి ముందు ఓకే అని చెప్పి కేటీఆర్ తర్వాత ఎందుకు నో చెప్పి ఉంటారా? ఒకవేళ ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తాడన్న సంగతి ముందు కేటీఆర్‌కు తెలియదా? ఆయనతో వేదికను పంచుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదా? తమ సహకారంతోనే కేంద్ర ప్రభుత్వం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు చేపట్టడానికి సిద్ధమవుతన్న నేపథ్యంలో పవన్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాడుతుండటం కేటీఆర్‌కు నచ్చక.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం సరి కాదని ‘నో’ చెప్పారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English