చైతూ-రష్మిక.. ఈ సినిమా ఎక్కడిదబ్బా?

చైతూ-రష్మిక.. ఈ సినిమా ఎక్కడిదబ్బా?

నాగచైతన్య సరసన రష్మిక అట.. వీళ్లిద్దరి కలయికలో ‘అదే నువ్వు అదే నేను’ అనే సినిమా అట.. ఆ చిత్ర శాటిలైట్ హక్కుల్ని జెమిని టీవీ వాళ్లు సొంతం చేసుకున్నారట. ఈ మేరకు జెమిని వాళ్ల ట్విట్టర్ పేజీలో గురువారం అప్ డేట్ ఇవ్వడంతో షాకవడం నెటిజన్ల వంతయింది.

అసలు చైతూతో కలిసి రష్మిక ఎప్పుడు సినిమా కమిటైందో కూడా తెలియదు. ఈ చిత్రానికి ‘అదే నువ్వు అదే నేను’ అనే టైటిల్ ఎప్పుడు ఖరారు చేశారో తెలియదు. అసలు ఈ సినిమాకు నిర్మాత ఎవరో.. దర్శకుడెవరో.. ఎప్పుడు సినిమా మొదలైందో.. లేక మొదలు కాబోతోందో ఏమీ తెలియదు. దీంతో జెమిని వాళ్ల ప్రకటన చూసి జనాలు అయోమయానికి గురయ్యారు.

నిజానికి పోయినేడాది నాగచైతన్యతో దిల్ రాజు ఓ సినిమా నిర్మించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఆ చిత్రానికి ‘అదే నువ్వు అదే నేను’ అనే టైటిల్ అంటూ ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ తర్వాత దాని గురించి ఏ ఊసూ లేదు. ఇప్పుడేమో జెమిని వాళ్లు ఈ టైటిల్‌తో సినిమా కొన్నామంటూ చైతూ, రష్మికలతో ఒక పోస్టర్ కూడా డిజైన్ చేసి ట్విట్టర్లో పెట్టేశారు. ట్విట్టర్ అకౌంట్‌ను మేనేజ్ చేసే వ్యక్తి ఏమైనా పొరబాటు చేశాడా.. నిజంగా ఈ ప్రాజెక్టు ఉందా అని జనాలు ఆరాలు తీస్తున్నారు.

ఇలా ఒక సినిమా గురించి దాని శాటిలైట్ హక్కులు తీసుకున్న సంస్థ అనౌన్స్ చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారి అయ్యుంటుందేమో. మరి నిజంగా దిల్ రాజు ఏమైనా.. చైతూ-రష్మిక కలయికలో ‘అదే నువ్వు అదే నేను’ అనే సినిమాను నిర్మిస్తున్నాడా.. మరి ఈ చిత్రానికి దర్శకుడెవరు.. సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు విడుదలవుతుంది.. లాంటి ప్రశ్నలకు జెమిని వాళ్లే కాస్త క్లారిటీ ఇస్తే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English