నాని గండం గట్టెక్కుతాడా?

నాని గండం గట్టెక్కుతాడా?

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తీవ్ర ఉత్కంఠతోనే ఉండి ఉంటాడు. అతడి కొత్త సినిమా ‘గ్యాంగ్ లీడర్’ బాక్సాఫీస్ టార్గెట్ చాలా పెద్దగానే ఉంది. కానీ ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. టీజర్, ట్రైలర్, ఆడియో అన్నీ బాగున్నా.. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించినట్లే కనిపించినా.. బుకింగ్స్ ట్రెండ్స్ మాత్రం కొంచెం నిరాశాజనకంగానే కనిపించాయి.

‘సాహో’ తాలూకు డిజప్పాయింట్మెంట్‌తో ప్రేక్షకులు వెనుకంజ వేస్తున్నారా.. వెంటనే మరో సినిమాకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేదా అన్నది తెలియదు కానీ.. నాని గత సినిమాలకు జరిగినట్లు దీనికి బుకింగ్స్ జరగలేదన్నది మాత్రం వాస్తవం. అలాగని పరిస్థితి తీసికట్టుగా ఏమీ లేదు. నాని కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబడితేనే బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి ఉండటంతోనే దీని మేకర్స్, బయ్యర్స్‌లో టెన్షన్ నెలకొంది.

గత సినిమా ‘జెర్సీ’ హిట్టయి నాని ఫామ్ అందుకోవడం, విక్రమ్ కుమార్‌తో అతడి కాంబినేషన్ ఆసక్తి రేకెత్తిడం.. ఔట్ పుట్ కూడా బాగున్నట్లే కనిపించడంతో ‘గ్యాంగ్ లీడర్’కు విడుదల ముందు హైప్ బాగానే ఉంటుందని అనుకున్నారు. కానీ పరిస్థితి కొంచెం భిన్నంగానే ఉంది. కానీ ఈ చిత్రం నాన్ స్టాప్ ఎంటర్టైనర్ అని.. అన్ని వర్గాల ప్రేక్షకులూ కనెక్ట్ అయ్యే అవకాశముందని చిత్ర వర్గాలు చాలా ధీమాగా ఉన్నాయి. కాబట్టి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆటోమేటిగ్గా పుంజుకుంటుందని.. లాంగ్ రన్ ఉంటుందని.. వసూళ్లు క్రమంగా పెరుగుతాయని.. అందరూ సేఫ్ అవుతారని నమ్మకంతో ఉన్నారు.

ఈ చిత్రం రూ.28-29 కోట్ల మధ్య షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. తర్వాతి వారంలో ‘వాల్మీకి’ అనే మరో క్రేజీ మూవీ వస్తున్న నేపథ్యంలో ‘గ్యాంగ్ లీడర్’ తొలి వీకెండ్లో భారీగానే వసూళ్లు రాబట్టాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు కూడా ఈ సినిమా విజయవంతం కావడం చాలా అవసరం. మరి శుక్రవారం మధ్యాహ్నానికి ‘గ్యాంగ్ లీడర్’ గురించి జనాలెలా మాట్లాడుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English