పూరి జ‌న‌గ‌ణ‌మ‌న ఆ హీరోతోనా?

పూరి జ‌న‌గ‌ణ‌మ‌న ఆ హీరోతోనా?

పూరి జ‌గ‌న్నాథ్ ద‌శ ఇలా తిరుగుతుంద‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. ఒక‌ప్పుడు పెద్ద పెద్ద స్టార్ల‌తో సినిమాలు చేసిన పూరికి ఈ మ‌ధ్య చిన్న స్థాయి హీరోలు కూడా డేట్లు ఇవ్వ‌ని ప‌రిస్థితి త‌లెత్తింది. టెంప‌ర్ త‌ర్వాత ఓ మోస్త‌రు స‌క్సెస్ కూడా లేని పూరి.. పూర్తిగా ఇండ‌స్ట్రీ జ‌నాల న‌మ్మ‌కం కోల్పోయాడు.

రామ్ లాంటి చిన్న హీరో అత‌డితో సినిమా చేస్తుంటే కూడా వారించారు చాలామంది. కానీ ఆ యంగ్ హీరోతో ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించి ఇండ‌స్ట్రీకి పెద్ద షాకే ఇచ్చాడు పూరి. ఇది ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయం కూడా ఉంది కానీ.. ఈ విజ‌యం పూరి కెరీర్‌కు గొప్ప ఊపు ఇచ్చిన మాట మాత్రం వాస్త‌వం. విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి యంగ్ సెన్సేష‌న్ పూరితో సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడు. వీరి క‌ల‌యిక‌లో సినిమా ఈ ఏడాది చివ‌ర్లో ప‌ట్టాలెక్క‌బోతోంది.

విజ‌య్‌తో చేయ‌బోయే సినిమా కూడా హిట్ట‌యితే పూరి కెరీర్ మ‌ళ్లీ పీక్స్‌కు చేరేలా క‌నిపిస్తోంది. ఈ సినిమా ఫ‌లితాన్ని బ‌ట్టి పూరితో ప‌ని చేయ‌డానికి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. పూరితో ప్ర‌భాస్ సినిమా అంటూ కొన్ని రోజులుగా ప్ర‌చారం సాగుతుండ‌గా.. ఇప్పుడ‌ది ఊపందుకుంది. మ‌హేష్ బాబుతో చేయాల‌నుకున్న పూరి క‌ల‌ల ప్రాజెక్టు జ‌న‌గ‌ణ‌మ‌న‌లో ప్ర‌భాస్ న‌టిస్తాడ‌న్న‌ది తాజా ఊహాగానం. పూరి-ప్ర‌భాస్ క‌ల‌యిక‌లో ఇంత‌కుముందు బుజ్జిగాడు, ఏక్ నిరంజ‌న్ సినిమాలొచ్చాయి.

అవి ఆశించిన స్థాయిలో ఆడ‌కున్నా.. ప్ర‌భాస్‌కు మంచి పేరు తెచ్చాయి. పూరి మీద ప్ర‌భాస్‌కు ముందు నుంచి గురి ఉంది. ఇప్పుడాయ‌న ఫామ్ అందుకున్న నేప‌థ్యంలో విజ‌య్ సినిమాతో హిట్టు కొట్టి క‌న్సిస్టెన్సీ చాటితే.. జ‌న‌గ‌ణ‌మ‌న చేయ‌డానికి ప్ర‌భాస్ రెడీ అని ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం సాగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English