సైరా 18 కోట్ల నుంచి 10.5 కోట్లకు?

సైరా 18 కోట్ల నుంచి 10.5 కోట్లకు?

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి యుఎస్ థియేట్రిక‌ల్ హ‌క్కుల అమ్మ‌కం విష‌యంలో పీఠ‌ముడి బిగుసుకున్న‌ట్లుగా కొన్ని రోజుల నుంచి వార్త‌లొస్తున్నాయి. రూ.250 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించినట్లుగా చెబుతున్న‌ ఈ చిత్రానికి అన్ని ఏరియాల‌కు భారీ రేట్లు పెట్టి అమ్మ‌కాలు సాగిస్తున్నారు.

కానీ చాలా ఏరియాల‌కు అనుకున్న ధ‌ర‌లతో సినిమాను అమ్మారు కానీ.. యుఎస్ హ‌క్కుల విష‌యమే తేల‌లేదు. రూ.18 కోట్ల రేటు చెప్ప‌డంతో అక్క‌డ బ‌య్య‌ర్లు బెంబేలెత్తిపోయిన‌ట్లు గుస‌గుస‌లు వినిపించాయి. చిరు రీఎంట్రీ మూవీ ఖైదీ నంబ‌ర్ 150 హిట్ టాక్‌తో యుఎస్‌లో 2.5 మిలియ‌న్ డాల‌ర్లే వ‌సూలు చేసింది. అలాంటిది సైరా మీద రూ.18 కోట్ల పెట్టుబ‌డి పెడితే ఆ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 4.5 మిలియ‌న్ డాల‌ర్ల దాకా రాబ‌ట్టాల్సి ఉంటుంది. ఎంత హిట్ టాక్ వ‌చ్చినా అది పెద్ద టార్గెటే.

బ‌య్య‌ర్లు వెనక‌డుగు వేయ‌డంతో సైరా నిర్మాత రామ్ చ‌ర‌ణ్ త‌గ్గక త‌ప్ప‌లేద‌ట‌. మ‌ధ్య‌లో రూ.15 కోట్ల ద‌గ్గ‌ర బేరాలు న‌డిచాయి. కానీ ఆ మొత్తానికి కూడా బ‌య్య‌ర్లు ఎవ‌రూ ముందుకు రాలేదు. చివ‌రికి రూ.10.5 కోట్ల‌కే యుఎస్ హ‌క్కుల్ని వీకెండ్ సినిమాస్ సంస్థ‌కు క‌ట్ట‌బెట్టిన‌ట్లుగా ఇప్పుడు వార్త‌లొస్తున్నాయి. సాహో స‌హా ఈ ఏడాది పెద్ద సినిమాలు చాలానే యుఎస్ బ‌య్య‌ర్ల‌ను ముంచేశాయి.

ఇంత‌కుముందులా అక్క‌డి జ‌నాలు వేలం వెర్రిగా సినిమాల‌కు వెళ్ల‌ట్లేదు. ప్రిమియ‌ర్ల‌కు కూడా గ‌తంలో మాదిరి రెస్పాన్స్ ఉండ‌ట్లేదు. సాహో మూడు భాష‌ల్లో క‌లిపి అతి క‌ష్టం మీద‌ 3 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. బ‌య్య‌ర్ల పెట్టుబ‌డిలో స‌గానికి స‌గం న‌ష్ట‌మే. ఈ నేప‌థ్యంలో సైరా కోసం అక్క‌డి బ‌య్య‌ర్లు ఎగ‌బ‌డ‌లేదు. దీంతో రీజ‌న‌బుల్ రేటుతో సినిమాను అమ్మాల్సి వ‌చ్చింది. ఇప్పుడు 3 మిలియ‌న్ డాల‌ర్లు రాబ‌డితే బ్రేక్ ఈవెన్ కాబ‌ట్టి ఆ టార్గెట్ సైరాకు పెద్ద క‌ష్టం కాక‌పోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English